
వజ్రాల వేట !
వజ్రకరూరు: మండల కేంద్రం సమీపంలోని చాలా పొలాల్లో వజ్రాన్వేషణ కొనసాగుతోంది. తెల్లారింది మొదలు సాయంత్రం పొద్దు పోయే వరకు వజ్రాల కోసం ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఇక్కడకు చేరుకొని అన్వేషిస్తున్నారు. భోజనం, వాటర్ బాటిళ్లతో ఇక్కడకు చేరుకొని చాలమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.