అనంతపురం: అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గుల్యపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా గ్రామంలో చిరుత సంచరిస్తోండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ అంశాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్న ఓ వ్యక్తికి చిరుత కనిపించింది. దీంతో అతడు భయంతో పరుగు తీశాడు. చిరుత సంచారంపై స్థానికులు మరోసారి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.