వజ్ర సంకల్పం
అనంతపురం జిల్లా వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట సాగుతోంది. ఏటా జూన్ మాసంలో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే ఇక్కడ వజ్రాన్వేషణ మొదలవుతుంది. అందులో భాగంగా ఇటీవల కురిసిన వర్షాలతో మండల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వాసులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. రోజూ ఉదయాన్నే పొలాలకు చేరుకుని సాయంత్రం వరకు ప్రతి రాయినీ పట్టిపట్టి చూస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా వజ్రాల వేటలో పడ్డారు. ఇటీవల లక్ష రూపాయల విలువైన వజ్రం లభించినట్లు తెలిసింది.
- వజ్రకరూరు