వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల గ్రామంలో సోమవారం గ్రామానికి చెందిన జి.గాదిలింగప్ప అనే రైతు ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిజ్ పేలింది. ప్రమాదంలో రూ.9 లక్షల దాకా ఆస్తి నష్టం వాటిల్లింది. ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలింది. దీంతో పక్కనే ఉన్న బీరువాలకు మంటలు వ్యాపించి రూ.2 లక్షల నగదు, మరోలక్ష విలువ గల పట్టుచీరలు, 10 తులాల బంగారం కాలిపోయింది. పొలాలకు సంబందించిన పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతాపుస్తకాలు, స్థలాలకు సంబంధించిన దస్త్రాలు, నిత్యావసర సరుకులు కూడా కాలిపోయినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అలాగే ఇంటిపైకప్పు కూడా దెబ్బతినింది. గుంతకల్లు నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా అప్పటికే పూర్తి నష్టం జరిగిపోయింది. స్థానిక ఉపసర్పంచు గురు, ఆర్‌ఐ సావిత్రి, వీఆర్వో మారెన్న తదితరులు అక్కడకు చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఫ్రిజ్ పే లి రూ.లక్షల నష్టం
Published Mon, Nov 14 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
Advertisement
Advertisement