శాంతియుతంగా నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసారని గుంటూరు బాధిత ముస్లిం యువకులు ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే.