రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలివిగా అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబరు వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.
అనంతపురం: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలివిగా అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీఈసీ మెంబరు వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానానికి వంత పాడుతూనే సమైక్యంధ్రా ముసుగు వేసుకున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాలుగు కళ్ల సిద్దాంతంతో ముందుకు వెళుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని ఎదుర్కొలేకే కాంగ్రెస్-టీడీపీలు కుట్రలు చేస్తున్నాయన్నారు.
ఈ క్రమంలోనే సీఎం కాంగ్రెస్ నిర్ణయాన్ని తెలివిగా అమలు చేస్తున్నారన్నారు. ఈ నెల 26వ తేదీన వైఎస్సార్ సీపీ తలపెట్టిన సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. సమైక్య వాదులంతా ఈ సభకు కలిసి రావాలని విశ్వేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు.