'పయ్యావుల నుంచి ప్రాణహాని ఉంది'
అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు బుధవారం డిమాండ్ చేశాయి. పయ్యావుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు నాగన్న ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా కూడేరు మండలం చోళసముద్రంలోని దళితవాడలో ఐదేళ్ల కిందట తాగునీటి సమస్యపై ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్త దళిత నాగన్న కుటుంబంపై ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కూడేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అయితే కేసు ఉపసంహరించుకోవాలని పయ్యావుల కేశవ్ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని నాగన్న తెలిపాడు.