అనంతపురం జిల్లా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్ఆర్ సీపీనేత, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.
అనంతపురం: టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఇప్పటి కూడా ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్ఆర్ సీపీనేత, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉరవకొండలో పయ్యావుల సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారారని విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.