![YSRCP MLC Vennapusa Gopal Reddy Fire on CM Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/7/44.jpg.webp?itok=s5Z7XD7R)
అనంతపురం ఓడీ చెరువు: ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగాకోరు పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబుకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి పిలుపునిచ్చారు. ఓడీ చెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఏ ఒక్క లబ్ధి చేకూరలేదన్నారు. అభివృద్ధి తిరోగమనంలో ఉందన్నారు. రుణమాఫీ అంతా మాయ అని పేర్కొన్నారు.
అపద్దాలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన చంద్రబాబును రాబోవు ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా, మూడేళ్ల పాటు మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి దోచుకోవడం తప్ప ప్రజా సేవ అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో నిరుపేదల పొట్ట కొట్టారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిలో అర్హులకు తీరని అన్యాయం చేశారన్నారు. తీవ్ర కరువుతో విలవిల్లాడుతున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ను సీఎం చేయాలని కోరారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నిత్యం ప్రజలతో మమేకమైన ఏకైక వ్యక్తిగా జగన్ ఖ్యాతి గడించారన్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పుట్టపర్తి నియోజవర్గంలోని 193 చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీటితో నింపుతామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు వైటీ ప్రభాకర్‌రెడ్డి, షాకీర్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షామీర్‌బాషా, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి మలక అశ్వత్థరెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, ఓడీ చెరువు, నల్లమాడ, అమడగూరు, పుట్టపర్తి, కొత్తచెరువు, పుట్టపర్తి అర్భన్ మండలాల కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, పొరకల రామాంజినేయులు, శేషురెడ్డి, గంగాద్రి, జగన్‌మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మీరెడ్డి, జగన్‌మోహన్‌చౌదరి, సర్పంచ్‌లు భాస్కర్‌రెడ్డి వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిన 500 కుటుంబాలు
ఓడీ చెరువు మండలం ఉంట్లవారిపల్లికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుర్లి ఉత్తమరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కుర్లి నర్సిరెడ్డి, కుర్లి దామోదరరెడ్డి, కుర్లిరంగారెడ్డి, కుర్లి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 500 కుటుంబాలు పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వుంట్లవారిపల్లి, తిప్పేపల్లి, తిప్పేపల్లి ఎస్సీ కాలనీ, తిప్పేపల్లి తండా, వంచిరెడ్డిపల్లి, లింగాలవారిపల్లి, సున్నంపల్లి, తంగేడుకుంట, బలిజపల్లి, మద్దకవారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ వెంకటప్ప.జన్మభూమి కమిటీ సభ్యులు మునెప్ప, గొర్ల నరసింహులు, దాదిరెడ్డిపల్లి హనుమంతురెడ్డి, లక్ష్మీనరసమ్మ, వార్డు సభ్యులు చిట్టెమ్మ, లక్ష్మి, శ్రీదేవి, రామచంద్ర, మామిళ్లకుంట్లపల్లి సుధాకర్‌రెడ్డి, బాలునాయక్, వెంకటస్వామి, హరి, రమణప్ప, బావన్న, వీరప్ప, నాగరాజు, ఆది, ఆదినారాయణ తదితరులు ఉన్నారు. అనంతరం నల్లమాడ మండలం నల్లసింగయ్యగారిపల్లిలోని దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో ఓడీ చెరువు మండలం కొండకమర్లకు చెందిన 50 మైనార్టీ కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment