శంకుస్థాపన ప్రాంగణానికి ఏడు మార్గాలు | Seven ways to go Capital foundation premises | Sakshi
Sakshi News home page

శంకుస్థాపన ప్రాంగణానికి ఏడు మార్గాలు

Published Wed, Oct 21 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

శంకుస్థాపన ప్రాంగణానికి ఏడు మార్గాలు

శంకుస్థాపన ప్రాంగణానికి ఏడు మార్గాలు

- వీఐపీలకు రెండు మార్గాలు కేటాయింపు
- ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్   
 
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకునేందుకు పోలీసు యంత్రాం గం ఏడు మార్గాలను ప్రకటించింది. ఇందులో రెండు పూర్తిగా వీఐపీల కోసం కేటాయించగా ఐదింటిని సాధారణ ప్రజలు వచ్చే వాహనాలకు కేటాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
 
 ఏఏఏ పాస్‌లున్న వాహనాలు వెళ్లాల్సిన మార్గం
 -    గన్నవరం విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలు బెంజిసర్కిల్-కనకదుర్గ వారధి, తాడేపల్లి అండర్‌పాస్ రోడ్డు, ఎన్టీఆర్  కరకట్ట, న్యూ లాక్ జంక్షన్, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా భీష్మాచార్య రోడ్డు నుంచి శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.
     - హైదరాబాద్ నుంచి వైపు వచ్చే వాహనాలు నందిగామ, ఇబ్రహీంపట్నం, బెంజి సర్కిల్, కనకదుర్గ వారధి, ఇస్కాన్ దేవాలయం, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా భీష్మాచార్య రోడ్డు నుంచి ప్రాంగణానికి చేరుకోవాలి.
 -    గుంటూరు వైపు నుంచి వాహనాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మీదుగా ఖాజా టోల్ ప్లాజా, కేఎల్ యూనివర్సిటీ, భీష్మాచార్య రోడ్డు ద్వారా శంకుస్థాపన ప్రాంతానికి చేరుకోవాలి.
 ఏఏ, ఏ పాసులు ఉన్న వాహనాలు
 -    గన్నవరం విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలు బెంజిసర్కిల్, కనకదుర్గ వారధి, ఉండవల్లి గుహల మీదుగా కరకట్ట రోడ్డుకు సమాంతరంగా కొత్తగా వేసిన భీష్మాచార్య రోడ్డు ద్వారా ప్రాంగణానికి చేరుకోవాలి.
 -    హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నంది గామ, ఇబ్రహీంపట్నం, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద బ్రిడ్జి మీదుగా కరకట్టకు సమాం తరంగా కొత్తగా వేసిన రోడ్డు ద్వారా చేరుకోవాలి.
 -    గుంటూరు వైపు నుంచే వచ్చే వాహనాలు నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ ప్లాజా, కేఎల్ యూనివర్సిటీ, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద బ్రిడ్జి మీదుగా కరకట్టకు సమాంతరంగా వేసిన కొత్త రోడ్డు మీదుగా ప్రాంగణానికి చేరుకోవాలి.
 -    విజయవాడ వైపు నుంచి సాధారణ సందర్శకులను తీసుకువచ్చే బస్సులు, లారీలు కనకదుర్గ వారధి, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, డాన్‌బాస్కో స్కూల్, యర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామానికి ఎదురుగా కొత్తగా వేసిన బైపాస్ రోడ్డు మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి.
 -    విజయవాడ వైపు నుంచి వచ్చే చిన్న వాహనాలు కనకదుర్గ వారధి, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, మంగళగిరి పాతబస్టాండ్, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళ్లాయపాలెం రోడ్డు మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.
 -    తమిళనాడు, నెల్లూరు, ఒంగోలు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనదారులు చిలకలూరిపే ట, గుంటూరు బైపాస్ రోడ్డు, పెదకాకాని, కంతే రు, తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు, రా యపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బై పాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంతానికి చేరుకోవాలి.
 -    కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు, హైదరాబాద్ నుంచి వచ్చే లారీలు, బస్సులు వినుకొండ, నర్సరావుపేట బైపాస్, ముప్పాళ్ల, సత్తెనపల్లి-నందిగామ అడ్డరోడ్డు, పెదకూరపాడు, అమరావతి, బోరుపాలెం, తుళ్లూరు బైపాస్, రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.
 -    హైదరాబాద్, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నందిగామ అడ్డరోడ్డు, పెదకూరపాడు, అమరావతి, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, తుళ్లూరు బైపాస్‌రోడ్డు, రాయపూడి, మోదుగులలంక, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.
 -    కర్నూలు, కడప, అనంతపురం, హైదరాబాద్ నుంచి వచ్చే చిన్న వాహనాలు నర్సరావుపేట బైపాస్, ఫిరంగిపురం, పేరేచర్ల, గుంటూరు ఔటర్‌రింగ్ రోడ్డు, తాడికొండ రోడ్డు, పెదపరిమి, తుళ్లూరు, రాయపూడి, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.
 -    శంకుస్థాపన రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకలను అనుమతించరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement