వీఐపీల ముసుగులో ఎర్రబుగ్గ కారు వాడుతున్న నలుగురి అరెస్ట్
వీఐపీల ముసుగులో ఎర్రబుగ్గ కారు వాడుతున్న నలుగురి అరెస్ట్
Published Mon, Dec 30 2013 7:05 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
వీఐపీల ముసుగులో ఎర్రబుగ్గ కారును ఉపయోగిస్తున్న నలుగురు వ్యక్తులను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలపై నీలి బుగ్గ, సైరన్, ఫ్లాషర్స్, ఎర్రబుగ్గను ఉపయోగించకూడదని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిన నేపథ్యలో గోవా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల అత్యున్నత పదవుల్లో కొనసాగే వ్యక్తులు తప్ప మరెవరూ ఎర్రబుగ్గ వాహనాలను ఉపయోగించడంపై సుప్రీం నిషేధం విధించింది.
విలాసవంతమైన కార్లపై ఎర్రబుగ్గ ఉండటంతో తనిఖీ చేశామని.. అనుమానస్పదం వ్యక్తుల తీరు కనిపించడంతో వాహనాలను సీజ్ చేసి వారిని అరెస్ట్ చేశాం అని పోలీసులు తెలిపారు. హర్యానా, ఢిల్లీలకు చెందిన వీఐపీలమని టాటా సఫారీ, టాయోటా ఫార్చునర్ వాహనాల్లో తిరుగుతున్న వారిని విచారించి.. వారిపై చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు. అధికారిక వాహనాలపై ఎర్రబుగ్గలను తీసివేసిన వారిలో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తొలి వరసలో ఉన్నారు.
Advertisement