HYD:10 మంది వీఐపీలపై డ్రగ్స్‌ కేసు | Radisson Hotel Drugs Case: Police Filed Complaint Against VIPs | Sakshi
Sakshi News home page

రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ.. 10 మంది వీఐపీలపై కేసు

Published Mon, Feb 26 2024 4:57 PM | Last Updated on Mon, Feb 26 2024 5:18 PM

Radison Drugs Case: Police Filed Case Against VIPs - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో పురోగతి చోటు చేసుకుంది. డ్రగ్స్‌ పార్టీలో పాలు పంచుకున్న  పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.

వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్‌, అబ్బాస్‌, కేదార్‌, సందీప్‌లు..  సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్‌ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్‌ దగ్గర వివేకానంద డ్రగ్స్‌ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్‌ పేపర్‌లో చుట్టి డ్రగ్స్‌ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్‌ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. 

సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి.. ‘‘రాడిసన్ బ్ల్యూ హోటల్ పై స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పోలీసులతో దాడి చేశాం. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడం తో సెర్చ్ చేశాం. అప్పటికే హోటల్ నుండి నిందితులు పరారయ్యారు . అప్పటికే అందించిన సమాచారంతో.. వివేకానంద ఇంటికి వెళ్ళాం. వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇంటికి వెళ్లిన సమయం లో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారు.  

వివేకానందను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశాం. వివేకా నంద తో పాటు నిర్భయ్ , కేదార్‌లకు పాజిటివ్ వచ్చింది. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించాము, కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఈ పార్టీ లో 10 మంది ఉన్నట్లు గుర్తించాం. రాడిసన్ హోటల్ లో గతంలో పార్టీలు జరిగాయి. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించాం. వివేకా నంద, నిర్భయ్ , కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు ను కూడా మేము అటాచ్ చేస్తున్నాం అని సీపీ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement