హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఓ నటి పేరు వినవస్తోంది. ఆమె పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు.. పిలిచి విచారిస్తామని అంటున్నారు. విశేషం ఏంటంటే.. ఆ నటి పేరు, ఆమె సోదరి పేర్లు గతంలోనూ డ్రగ్స్ వ్యవహారంలో వినవచ్చాయి.
యూట్యూబర్‌గా, షార్ట్ ఫిల్మ్స్‌తో లిషి గణేష్‌పేరును రాడిసన్ డ్రగ్స్‌పార్టీ కేసులో సైబరాబాద్ పోలీసులు చేర్చినట్లు సమాచారం. బీజేపీ నేత తనయుడైన గజ్జల వివేకానంద రాడిసన్ హోటల్‌లో ఈ డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. అయితే ఆ పార్టీకి లిషి కూడా వెళ్లిందని గుర్తించామని.. ఆమెను కచ్చితంగా పిలిచి విచారిస్తామని కూడా చెబుతున్నారు. జియోమెట్రీ బాక్స్ లాంటి షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ఆమె ఓ గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వీడియోలతోనూ ఆమె యూజర్లను అలరిస్తుంటారు.
ఇక.. 2022లో సంచలన చర్చకు దారి తీసిన మింక్ పబ్ డ్రగ్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండిస్తూ చీజ్ బజ్జీలు తినడానికి వెళ్లామంటూ ఓ ఇంటర్వ్యూ లో పేర్కొంది. అంతే.. ఆమెను తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్ పేరు రాడిసన్ డ్రగ్స్ కేసులో వినిపించడం గమనార్హం. లిషితో పాటు శ్వేత అనే వీఐపీ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చేర్చారు.
Actor Lishi named again in drugs case
— Sudhakar Udumula (@sudhakarudumula) February 26, 2024
Gachibowli police of #Cyberabad named Kallapu Lishi Ganesha as accused in the Radisson hotel drugs case in which BJP leader’s son Gajjala Vivekananda was caught.
She acted in a short film titled 'Geometry Box'
Vivekananda confessed and… pic.twitter.com/QHrEnRQHJp
Comments
Please login to add a commentAdd a comment