ఎయిర్ పోర్టులో వీఐపీల సందడి
Published Mon, Apr 24 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
మధురపూడి :
వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ, వై.ఎస్. జగ¯ŒS మోహ¯ŒS రెడ్డి సోదరి షర్మిల సోమవారం స్పైస్ జెట్ విమాన సర్వీసులో హైదరాబాద్ వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో–ఆరి్డనేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, తానేటి వనిత, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ కార్యదర్శి అడపా శ్రీహరి, పార్టీ అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, వాణిజ్యవిభాగం రాష్ట్ర కార్యదర్శి రాయపురెడ్డి చిన్నా, మహిళా విభాగం రాజమహేంద్రవరం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్ మోహ¯ŒS రెడ్డి, పార్టీ నాయకులు సుంకర చిన్ని, ఈశ్వర్, రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
బ్రదర్ అనిల్‌కుమార్‌కు స్వాగతం
రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సోమవారం ప్రముఖుల సందడి ఏర్పడింది. బ్రదర్ అనిల్ కుమార్ జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులో హైదరాబాద్ వెళ్లారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజుబాబు, ఫాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్ సిన్హా, ఫెలోషిప్ జిల్లా అధ్యక్షుడు కోడి మోజేష్, శుభాకర్ శాస్త్రి, జోహ¯ŒS అలో¯ŒS ఆయనను కలిసి స్వాగతం పలికారు. సమాచార హక్కుల చట్టం కమిషనర్ పి. విజయబాబు స్పైస్ జెట్ విమాన సర్వీసులో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లారు. సినీ హీరో చరణ్, హీరోయి¯ŒS సమంతలు తిరుగు పయనం ప్రముఖ సినిమా హీరో రామ్‌చరణ్, హీరోయి¯ŒS సమంతలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన షూటింగుల్లో వీరు పాల్గొన్నారు.
Advertisement
Advertisement