anilkumar
-
ముగ్గురు అదనపు జడ్జీల శాశ్వత హోదాకు కేంద్రం ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు అదనపు న్యాయమూర్తు లకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వానికి వీరి హోదా గురించి సిఫారసు చేసింది.జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారా యణ, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్ కె.సుజనలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న ప్రతిపాదనలకు కొలీజియం ఈ నెల 5వ తేదీనే ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.ఈ ముగ్గురు న్యాయ మూర్తులు 2023, జూలై 31న హైకోర్టు అద నపు న్యాయమూర్తులుగా నియమితులైన విష యం తెలిసిందే. కాగా, శాశ్వత న్యాయ మూర్తు లుగా జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్ కె.సుజన శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఆసక్తికర అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్‌లో భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్‌గ్రూపుదే కీలకపాత్ర అని పేర్కొంది. భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కుమార్ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్ మల్హోత్రా, అమన్‌దీప్, మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను సోమవారం ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుల్ని కస్టడీలోకి ఇవ్వాలని ఈడీ కోరింది. రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఈడీ చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ చార్జిషీట్లలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శరత్‌చంద్రారెడ్డి, కవిత సన్నిహితుడు వి.శ్రీనివాసరావు, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్, ఫీనిక్స్ గ్రూపు, ఎన్‌గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్ తదితరుల పేర్లను ప్రస్తావించింది. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా అసాధారణ అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పింది. చార్జిషీటులోని ముఖ్యాంశాలు ఆప్ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది. ► అరుణ్పిళ్లైకి క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వాములు, రవిశంకర్ చెట్టి రూ.5 కోట్లకు హైదరాబాద్‌లో భూమి అమ్మారన్న ఆరోపణలున్నా వారెవరూ అరుణ్పిళ్లైను కలవలేదు. ఈ ఒప్పందాన్ని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు చెందిన శ్రీహరి చర్చలు జరిపి ఖరారు చేశారు. భూమి కొనుగోలు నిమిత్తం సంస్థకు ఒకరు డబ్బులు బదిలీ చేస్తారని చెప్పిన శ్రీహరి.. ఎవరు డబ్బులు బదిలీ చేశారనేది రవిశంకర్ చెట్టికి చెప్పలేదు. అయితే, ఎన్‌గ్రోత్ కాపిటల్ పేరుతో ఫీనిక్స్ గ్రూపునకు చెందిన శ్రీహరి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పారు. ఆ సమయంలో ఫీనిక్స్ గ్రూపునకు సీవోవోగా శ్రీహరి ఉన్నారు. దీంట్లో కవిత భర్త అనిల్‌కుమార్ కూడా భాగస్వామి. కవిత తెలంగాణలో పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే భూమి కొనుగోలు చేశారు. దీంతోపాటు కవిత మరో ప్రాపర్టీ కూడా కొనుగోలు చేశారు. 25వేల చదరపు అడుగుల ప్రాపర్టీకి సంబంధించిన పేపర్ వర్క్‌ను బుచ్చిబాబు, శ్రీహరి పూర్తిచేశారు. మార్కెట్ ధర చదరపు అడుగు రూ.1,760 ఉంటే రూ.1,260 మాత్రమే చెల్లించారు. కవితతో గణనీయమైన ఆర్థిక లావాదేవీలున్న వ్యక్తి రవిశంకర్‌తో భూమి కొనుగోలుకు చర్చలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇండోస్పిరిట్స్‌లో కవిత తరఫున అరుణ్ పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించి రూ.32.86 కోట్లు అందుకున్నారు. పిళ్లై సూచన మేరకు రూ.25.5 కోట్లు నేరుగా ఇండోస్పిరిట్స్ నుంచి పిళ్లై ఖాతాకు బదిలీ అయ్యాయి. ► ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మద్యం దుకాణం నిమిత్తం ఎన్వోసీ కోసం జీఎంఆర్ గ్రూపునకు చెందిన బీవీ నాగేశ్వరరావుతో మాగుంట రాఘవ, ఎంపీ ఎంస్ రెడ్డి చర్చలు జరిపారు. ఎంఎస్ రెడ్డి వాట్సాప్ సందేశాల ద్వారా ఇది వెల్లడైంది. వ్యాపారంలో భాగస్వాములై ఎన్వోసీ ఇవ్వాలని జీఎంఆర్‌ను కోరినట్లు తేలింది. ఇండోస్పిరిట్స్‌లో అరుణ్ పిళ్లై ప్రాక్సీ భాగస్వామి. ఇండోస్పిరిట్స్ నుంచి లాభాలు తన నుంచి కవితకు చేరడంపై అరుణ్పిళ్లై సేట్మెంట్ల ద్వారా వెల్లడైంది. ► ఏప్రిల్ 2022లో ఢిల్లీలోని ఓ హోటల్లో విజయ్‌నాయర్‌తో కవిత, అరుణ్పిళ్లై సమావేశమయ్యారు. వ్యాపార కార్యకలాపాలు కుంటుపడుతున్న నేపథ్యంలో చెల్లించాల్సిన లంచాలు రికవరీ చేయడంపై చర్చించారు. హోటల్ రికార్డుల దీన్ని ధ్రువీకరించుకున్నాం. దినేష్ ఆరోరా, అరుణ్పిళ్లై వాంగ్మూలాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ► కిక్‌బ్యాక్‌ల రూపంలో సొమ్ములు వెనక్కి మళ్లించే పనులను అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై నిర్వహించినట్లు ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలమిచ్చారు. సౌత్‌గ్రూప్ నుంచి కిక్‌బ్యాక్‌లను విజయనాయర్ అందుకుంటున్నారన్నారు. విజయ్నాయర్కు డబ్బు అవసరమని బుచ్చిబాబు ఫోను నంబర్ల ద్వారా చేసిన వాట్సాప్ సందేశాల ద్వారా ధ్రువీకరణ అయింది. దీంట్లో ‘వీ’కి డబ్బు కావాలి అంటే విజయ్నాయర్కు డబ్బు అవసరమని అర్థమని బుచ్చిబాబు తెలిపారు. ► ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్లలో జరిగిన సమావేశాల్లో సౌత్‌గ్రూపు నుంచి విజయ్నాయర్కు డబ్బులు పంపడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా బుచ్చిబాబు తెలిపారు. క్రియేటివ్ డెవలపర్స్ ఖాతాకు డబ్బు మళ్లించడం కూడా బుచ్చిబాబు నోట్స్ ద్వారా తెలిసింది. కవిత తరఫున ఇండోస్పిరిట్స్ నుంచి వచ్చిన లాభాలను అరుణ్ పిళ్లై అందుకొని ఆమె ఆదేశాల మేరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ధ్రువీకరణ అయింది. భూముల కొనుగోలులో శ్రీహరి సూచనల మేరకు కవిత తరఫున సొమ్ములు బదిలీ చేయడం వరకే పిళ్లై పాత్ర పరిమితమని తేలింది. అయితే, మే 2022 నుంచి రిజిస్టర్ కాకుండా ఉన్న భూమి 11.10.22న అరుణ్పిళ్లై భార్య పేరు మీద రిజిస్టర్ కావడం అరుణ్పిళ్లై ప్రయోజనం కోసమేనని, కవితకు లాభదాయకం కాదని దర్యాప్తులో తేలింది. అరుణ్పిళ్లై ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్స్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్లకు రూ.కోటి, రూ.70 లక్షలు బదిలీ చేసినట్లు సమీర్ మహేంద్రు తెలిపారు. దీనికి మద్దతుగా ఎలాంటి రికార్డు లేదు. అయితే, అరుణ్ పిళ్లై చెప్పినట్లుగా ఈ సంస్థలు ఇండో స్పిరిట్స్ లేదా అరుణ్ పిళ్లైకి ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆయా సంస్థలకు ఇచ్చిన సొమ్ము ఇప్పటివరకూ వెనక్కి ఇవ్వలేదు. గౌతమ్ ముత్తాకు అరుణ్పిళ్లై బదిలీ చేసిన రూ.4.76 కోట్లు, అభిషేక్‌కు రూ.3.85 కోట్లు బదిలీ రుణం తిరిగి ఇవ్వమని చెప్పినప్పటికీ కాలక్రమేణా ఎలాంటి రుణం లేదని పిళ్లై పేర్కొన్నారు. -
తెచ్చిందెవరు.. వాడిందెవరు?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాడిసన్‌బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సూత్రధారులతోపాటు మాదకద్రవ్యాలు వినియోగించిన వారిని గుర్తించేందుకు బంజారాహిల్స్ పోలీసులు పలు కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం అరెస్టయిన మహాదారం అనిల్‌కుమార్, ఉప్పాల అభిషేక్‌లను సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో వీరమాచినేని అర్జున్, పి.కిరణ్రాజులను కూడా నిందితులుగా చేర్చారు. పబ్ మేనేజర్‌గా ఉన్న అనిల్‌కుమార్ ఈ కేసులో కీలకమని.. అతడితోపాటు అభిషేక్‌ను వారం పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు: ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి.. డ్రగ్స్, రేవ్ పార్టీ గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సం దర్భంగా బిగ్‌బాస్ విన్నర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్ధార్థ్‌తోపాటు పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా రు. పోలీసులు వారందరి వివరాలు నమోదు చేసు కుని పంపేశారు. ఈ వ్యవహారంపై ఎన్డీపీఎస్ చట్టంలోని 8సీ, 22 బీ, 29 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలు దొరికిన ప్రాంగణం యజమానులు నిందితులుగా మారతారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది పబ్‌ను లీజుకు తీసుకున్న అభిషేక్, అర్జున్, కిరణ్‌లను నిందితులుగా చేర్చారు. పబ్‌లోని బార్ కౌంటర్‌పై స్ట్రాలు పెట్టే క్యాడీ (ప్లాస్టిక్ డబ్బా) నుంచి 5 కొకైన్ పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మొత్తం 4.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ బార్ కౌంటర్ మేనేజర్ అనిల్‌కుమార్ ఆధీనంలో ఉండటంతో అతడు నిందితుడిగా మారాడు. వీరిలో అభిషేక్, అనిల్ లను అరెస్టు చేయగా.. అర్జున్, కిరణ్‌రాజ్ ఇద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పబ్ యజమా నుల్లో ఒకరైన కిరణ్‌రాజ్ ఓ కేంద్ర మాజీ మంత్రి అల్లుడిగా తెలుస్తోంది. దీన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. సీసీ కెమెరాల్లో దొరకలే.. పబ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సోమవారం విశ్లేషించారు. 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ పబ్‌లో ఓ పక్కగా బార్ కౌంటర్ ఉంది. పార్టీ జరిగే సమ యంలో అంతా కిక్కిరిసి, కౌంటర్‌కు అడ్డుగా ఉండటంతో.. అనిల్‌కుమార్ కదలికలు కనిపించలేదని పోలీసులు చెప్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. అతడి ఫోన్, ఐపాడ్లను విశ్లేషిస్తే.. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకున్నారన్న అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక పబ్‌లో డ్రగ్స్ వాడినవారిని గుర్తించడానికి అవసరమైన ప్రతి ఆధారాన్నీ పోలీసులు సేకరిస్తున్నారు. పబ్‌లో ఆదివారం చేసిన దాడుల్లో క్లూస్‌టీం 216 సిగరెట్ బడ్స్‌ను సీజ్ చేసింది. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం ద్వారా ఎవరైనా డ్రగ్స్ వాడారా అనేది తేల్చాలని భావిస్తున్నారు. వాటిని వినియోగించిన వారి లాలాజలం సిగరెట్ పీకలకు అంటుకుని ఉం టుందని.. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయిస్తే, ఎవరు కాల్చారనేది బయటపడుతుందని అధికారులు చెప్తున్నారు. దీనితోపాటు అనిల్‌కుమార్‌ను విచారించి డ్రగ్స్ వాడినవారి పేర్లను రాబట్టాలని.. వారి నుంచి రక్తం, తల వెంట్రుకల శాంపిల్స్ తీసుకుని ఫోరెన్సిక్ పరీక్షలు చేయించాలని భావిస్తున్నారు. రాడిసన్ హోటల్ బార్ లైసెన్సు రద్దు రాడిసన్‌బ్లూ రెస్టారెంట్ అండ్ బార్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాత్రి హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎన్ఏ అజయ్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 6లో ఉన్న ఈ రెస్టారెంట్ అండ్ బార్‌లోని పబ్‌లో డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో 2బి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తొలుత ఈ విషయంగా షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారులు.. కొద్దిగంటల్లోనే లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. -
చినపులిపాక సర్పంచ్‌పై టీడీపీ వర్గీయుల దాడి
-
చినపులిపాక సర్పంచ్‌పై టీడీపీ వర్గీయుల దాడి
తోట్లవల్లూరు (పామర్రు), లబ్బీపేట (విజయవాడ తూర్పు): కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చినపులిపాక గ్రామంలో ఓ స్థలం వ్యవహారంలో వైఎస్సార్సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ ఆరేపల్లి శివరామకృష్ణ (రాము)పై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. చినపులిపాక–వల్లూరుపాలెం మధ్య ఆర్ అండ్ బీ రహదారి పక్కన ఉన్న ఓ స్థలానికి సంబంధించి, గ్రామానికి చెందిన నాగరాజును టీడీపీ వర్గీయుడు కాగిత శ్రీనివాసరావు, అతని కుటుంబ సభ్యులు ఆదివారం దుర్భాషలాడారు. దీనిపై ప్రశ్నించటానికి వెళ్లిన సర్పంచ్ ఆరేపల్లి శివరామకృష్ణతో వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది. ఈ దశలో సర్పంచ్ వర్గీయులు ప్రతిఘటించడంతో శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాయపడిన సర్పంచ్‌ను తొలుత కంకిపాడు ఆస్పత్రికి, తర్వాత విజయవాడకు తరలించారు. ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, చినపులిపాకలో సర్పంచ్‌పై దాడి చేసిన టీడీపీ నేత తనపైనే దాడి జరిగిందంటూ తలకు కట్టుకట్టుకుని ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. వైద్యులు పరీక్షించి, పెద్దగా దెబ్బలు లేక పోవడంతో వెంటనే పంపించి వేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, వీరపనేని శివరామ్, వీరంకి గురుమూర్తి మరికొందరు డ్రామాకు తెరలేపారు. అనుకూలమైన టీవీ చానళ్ల విలేకరులను పిలిచి రెండు గంటలు డ్రామా నడిపించారు. దాడి చేసి రాజకీయమా? అనవసరంగా ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించిన సర్పంచ్‌పై తండ్రీ కొడుకులు ఇనుప రాడ్డుతో దాడి చేయడం దుర్మార్గమని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మండిపడ్డారు. దాడి చేయడమే కాకుండా, తమ వారిపైనే వైఎస్సార్సీపీ సర్పంచ్ దాడి చేశాడంటూ టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ శివరామకృష్ణను ఆదివారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ వాతావరణాన్ని కలుషితం చేసేలా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. ఆక్రమణలను ప్రశ్నిస్తుంటే దాడులకు తెగబడుతున్నారన్నారు. శివరామకృష్ణ తలకు బలమైన గాయమైందని, ఐదు కుట్లు వేశారని చెప్పారు. టీడీపీ వర్గీయుడికి ఒక్క కుట్టు పడకున్నా, పెద్ద పెద్ద కట్లు కట్టుకుని డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. -
సంక్షేమం..అభివృద్ధే గెలిపించాయి..
తాడేపల్లి: ప్రజల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు, చేసిన అభివృద్ధి మున్సిపల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిధిని, 108, 104 సేవలను కూడా పెంచామన్నారు. కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. నూతనంగా, 3 పోర్టులు, 4 షిప్పింగ్ హర్బర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలవరం, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకొచ్చామన్నారు. తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు. మాట మాట్లాడితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా బుద్ధి చెప్పారన్నారు. అధికార పార్టీని ఏం పీకుతారు అన్న బాబుకి , ప్రజలే డిపాజిట్లు కూడా లేకుండా జెండా పీకేశారని విమర్షించారు. 2019 అసెంబ్లి ఎన్నికల్లో ప్రజలు బాబుని పీకేశారు. ఇక 2024లో టీడీపీ జెండాను కూడా పీకి పడేస్తారని అన్నారు. అయితే తమకు ఇంత భారీ మెజార్టీనిచ్చిన ప్రజలకు తమ ప్రభుత్వం ఎప్పటికి రుణపడి ఉంటుందని అన్నారు. చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు -
టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
-
టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకి స్పీకర్ వ్యవస్థపై గౌరవం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు కోరుతూ శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌ని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌ను అవమానించిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. గత స్పీకర్ ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్నారు. బీసీ స్పీకర్‌ను దారుణంగా కించపరిచేలా టీడీపీ వెబ్సైట్ ఈ-పేపర్లో ఇష్టానుసారంగా రాశారని ధ్వజమెత్తారు. నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కూన రవిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభను స్పీకర్ హుందాగా నడుపుతుంటే చంద్రబాబు బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. -
వెయిట్ లాస్ కోసమే చంద్రబాబు దీక్ష
సాక్షి, తాడేపల్లి : వెయిట్ లాస్ కోసమే చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నారని, ఆయనకు డేరా బాబాకు ఏం తేడా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం వాళ్ల ఉనికి కాపాడుకోవడం కోసమే ఆయన తన కుమారుడితో కలిసి పనికిమాలిన దీక్షను చేపట్టారని ఆరోపించారు. ఇసుకలో వేలకోట్లు దండుకున్న చంద్రబాబే ఇప్పుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన గురువారం పార్టీ ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, కైలే అనిల్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వరదలతో ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవమే అయినా రాష్ట్రంలో ప్రసుత్తం లక్షా 50 వేల టన్నుల సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల భరోసా కోసమే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన బ్లూ ప్రాగ్ సంస్థ యజమాని, చంద్రబాబు సన్నిహితులని వారిద్దరు కలిసి ఒకే ఛాపర్లో తిరిగేవారని ఆరోపించారు. ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సంస్థలు చంద్రబాబుకు పిల్ల కాలువలుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు. బాబు విడుదల చేసింది దొంగ చార్జీషీట్ అని దమ్ముంటే ఇసుక ఆరోపణలపై ఆధారాలు చూపించాలని పేర్కొన్నారు. అతిపెద్ద ఇసుక దొంగ దేవినేని ఉమానే ! చంద్రబాబుకు మతి భ్రమించి దీక్షలు చేస్తున్నారని , ఇసుకపై ఆయన చేస్తున్న దీక్ష దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో అతిపెద్ద ఇసుక దొంగ దేవినేని ఉమామహేశ్వరరావు అని, అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని దీక్ష చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. టీడీపీ వేసిన దొంగ చార్జీషీట్‌ను ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరని , ఎన్నికల ద్వారా ప్రజలు గట్టిగా బుద్ది చెప్పినా చంద్రబాబులో ఏ మార్పు రాలేదని తెలిపారు. ఉమా విధానం నచ్చకనే ఆయన తమ్ముడు ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. తెలంగాణలో కనుమరుగైనట్లే ఏపీలో కూడా టీడీపీ కనుమరుగవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే గురువారం బాబు దీక్ష నిర్వహిస్తుండగానే దేవినేని అవినాష్ వైసీపీలో చేరిన విషయాన్ని కూడా కృష్ణ ప్రసాద్ ప్రస్తావించారు. టీడీపీ నాయకులు గత ఐదేళ్ల పాలనలో అడ్డుగోలుగా ఇసుకను తిని అరిగించుకున్నారని ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ దుయ్యబట్టారు. గత ఐదేళ్ళలో ఇసుక దోచుకోవడంపై పవన్‌కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఒకవేళ తమ పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కేసులు పెట్టమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే స్వయంగా చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందనటానికి ఇదే నిదర్శనమన్నారు. -
నిర్మాత కె. అనిల్ ఇక లేరు
‘ప్రముఖ దర్శకులు బాపుతో ‘రాధాగోపాళం, కె. రాఘ వేంద్ర రావుతో అల్లరి బుల్లోడు’ చిత్రాలు నిర్మించిన కోనేరు అనిల్ కుమార్ ఇకలేరు. క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనిల్ కుమార్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 31st December 2017
-
సత్యవాఖ్యోపదేశమ్ 17th December 2017
-
జిల్లాలో కొత్తగా 24 బార్లు
ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ ప్రకారం జిల్లాలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో బార్లు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికలకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న బార్లకు నిబంధనలకనుగుణంగా ఉంటే వాటికి కొత్త లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు. కొత్త బార్లకు దరఖాస్తుదారులు రూ.2 లక్షలు(తిరిగి చెల్లించని) చలానా కట్టి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బార్లు నడుపుతున్న యజమానులు కూడా ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం అనంతపురం, పెనుకొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో సంప్రదించాలని వివరించారు. ఈ నెల 29లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదే రోజు రాత్రి 9 గంటలలోగా పూరించిన దరఖాస్తులు అనంతపురం సూపరింటెండెంట్ కార్యాలయంలో అందజేయాలని వివరించారు. 30న లాటరీ తీయనున్నట్లు వెల్లడించారు. నూతన పాలసీతో పెరగున్న బార్లు ఇలా పట్టణం ప్రాంతం ప్రస్తుత బార్లు కొత్తవి మొత్తం అనంతపురం కార్పొరేషన్ 2 6 8 తాడిపత్రి మున్సిపాలిటీ 1 2 3 గుంతకల్ మున్సిపాలిటీ – 4 4 రాయదుర్గం మున్సిపాలిటీ – 2 2 గుత్తి మున్సిపాలిటీ – 1 1 పామిడి నగర పంచాయతీ – 1 1 ధర్మవరం మున్సిపాలిటీ 1 3 4 హిందూపురం మున్సిపాలిటీ 4 1 5 కదిరి మున్సిపాలిటీ – 2 2 కళ్యాణదుర్గం మున్సిపాలిటీ – 1 1 మడకశిర నగర పంచాయతీ – 1 1 -
ఎయిర్ పోర్టులో వీఐపీల సందడి
మధురపూడి : వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ, వై.ఎస్. జగ¯ŒS మోహ¯ŒS రెడ్డి సోదరి షర్మిల సోమవారం స్పైస్ జెట్ విమాన సర్వీసులో హైదరాబాద్ వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో–ఆరి్డనేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, తానేటి వనిత, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ కార్యదర్శి అడపా శ్రీహరి, పార్టీ అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, వాణిజ్యవిభాగం రాష్ట్ర కార్యదర్శి రాయపురెడ్డి చిన్నా, మహిళా విభాగం రాజమహేంద్రవరం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్ మోహ¯ŒS రెడ్డి, పార్టీ నాయకులు సుంకర చిన్ని, ఈశ్వర్, రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. బ్రదర్ అనిల్‌కుమార్‌కు స్వాగతం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సోమవారం ప్రముఖుల సందడి ఏర్పడింది. బ్రదర్ అనిల్ కుమార్ జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులో హైదరాబాద్ వెళ్లారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజుబాబు, ఫాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్ సిన్హా, ఫెలోషిప్ జిల్లా అధ్యక్షుడు కోడి మోజేష్, శుభాకర్ శాస్త్రి, జోహ¯ŒS అలో¯ŒS ఆయనను కలిసి స్వాగతం పలికారు. సమాచార హక్కుల చట్టం కమిషనర్ పి. విజయబాబు స్పైస్ జెట్ విమాన సర్వీసులో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లారు. సినీ హీరో చరణ్, హీరోయి¯ŒS సమంతలు తిరుగు పయనం ప్రముఖ సినిమా హీరో రామ్‌చరణ్, హీరోయి¯ŒS సమంతలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన షూటింగుల్లో వీరు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
కనగానపల్లి (రాప్తాడు) : రామగిరి మండలం ఎగువపల్లి సమీపంలో ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన అనిల్‌కుమార్ (18) రామగిరిలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం పేరూరు నుంచి రామగిరికి ఆటోలో వస్తుండగా ఎగువపల్లి వద్ద ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. కుడివైపున కూర్చున్న అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని పేరూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్టల్ విద్యార్థులకు సీమోన్ అమృత పౌండేషన్ చేయూత
రగ్గులు పంపిణీ చేసిన అధినేత అనిల్‌కుమార్ పాతగుంటూరు : హాస్టల్ విద్యార్థులకు సీమోన్ అమృత్ ఫౌండేషన్ అధినేత అనిల్‌కుమార్ రగ్గులు పంపిణీ చేశారు. ‘విద్యార్థులు గజ..గజ’ శీర్షికన గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. గుంటూరు పట్టాభిపురంలోని ఎస్సీ, బీసీ హాస్టల్‌ను సందర్శించి 50 మంది విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేశారు. అలాగే కళాశాలలో చదువుతూ హాస్టలో ఉంటున్న మరో 20 మందికి కూడా రగ్గులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలికి విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలుసుకుని ఇక్కడకు వచ్చానన్నారు. చలికాలంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి రగ్గులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదిగి మరొకరికి సాయపడాలని సూచించారు. ‘సాక్షి’ కథనానికి దాతలు ముందుకు వస్తున్నారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూవో రాజదేవర, హాస్టల్స్ హెచ్‌డబ్ల్యూవోలు జితేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వియ్యన్నరావు సతీమణి జ్యోతి మరో 40 మంది విద్యార్థులకు దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. హాస్టల్ కిటికీలకు కర్టన్స్ను కూడా అందించారు. -
అర్జీదారులకు న్యాయం చేయండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి జరి గింది. కలెక్టర్‌తో పాటు జేసీ ఉషాకుమారి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్ తదితర అధికారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఆయాశాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పరి ష్కరించిన వెంటనే అర్జీదారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. జెడ్పీ సీఈవో డి.సుబ్బారావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, డీఎంఅండ్‌హెచ్‌వో జె.సరసిజాక్షి, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, ఆర్వీఎం పీవో బి.పద్మావతి, డీపీవో కె.ఆనంద్, డీఎస్వో పి.బి.సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, మత్స్యశాఖ డీడీ కల్యాణం, బందరు ఆర్డీవో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే... డిసెంబర్ 31న నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని చర్చి ఫాదర్ మోజెస్, ఆయన భార్య సువర్తామ్మపై కత్తులతో దాడిచేసి గాయపరిచిన ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టిషన్ కౌన్సిల్ సభ్యులు కె.డానియల్రాజు, కె.కృపావరం అర్జీ ఇచ్చారు. అవనిగడ్డలోని తంగిరాల వీరరాఘవయ్య పార్కు డంపింగ్ యార్డుగా మారిందని, చెత్త తొలగించి పార్కును వినియోగంలోకి తేవాలని సామాజిక కార్యకర్త ఆది రామ్మోహనరావు అర్జీ సమర్పించారు. వీరులపాడు మండలం నరసింహారావుపాలెం గ్రామంలోని సర్వే నంబరు 164లో ఉన్న పల్లగుట్టలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుడు పి.కామేశ్వరరావు ఫిర్యాదుచేశారు. మచిలీపట్నం మునిసిపాల్టీలోని చెత్తను పట్టణంలోని జాతీయ కళాశాల సమీపంలో వేస్తున్నారని, దీని వల్ల కళాశాల విద్యార్థులు, ఎస్ఎన్ గొల్లపాలెం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ ఫిర్యాదుచేశారు. రుద్రవరం సమీపంలో సేకరించిన 50 ఎకరాల్లో కంపోస్ట్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లక్ష్మీపురం పంచాయతీ, రామానగరంలోని బీసీ బాలుర హాస్టల్‌ను మోపిదేవి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో విలీనం చేసేందుకు జరుగుతున్న యత్నాలను విరమించాలని టీడీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు అందే జగదీష్ కోరారు. హాస్టల్‌ను విలీనం చేస్తే అందులో వసతి పొందుతున్న ఘంటసాల, చల్లపల్లి మండలాల బీసీ విద్యార్థులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో బెల్టుషాపులు, సారా, మత్తు పదార్థాల విక్రయాలను నిషేధించేందుకు 2002 నుంచి పోరాడుతున్న గ్రామస్తులకు ఎక్సైజ్‌శాఖ అధికారులు సహకరించాలని కోరుతూ గ్రామానికి చెందిన తమ్ము ఏడుకొండలు అర్జీ సమర్పించారు. -
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాఖ్యోపదేశమ్ 21st july 2013
-
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాఖ్యోపదేశమ్ 30th June 2013