సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకి స్పీకర్ వ్యవస్థపై గౌరవం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు కోరుతూ శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌ని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌ను అవమానించిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. గత స్పీకర్ ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్నారు. బీసీ స్పీకర్‌ను దారుణంగా కించపరిచేలా టీడీపీ వెబ్‌సైట్ ఈ-పేపర్‌లో ఇష్టానుసారంగా రాశారని ధ్వజమెత్తారు. నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కూన రవిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభను స్పీకర్ హుందాగా నడుపుతుంటే చంద్రబాబు బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment