హాస్టల్ విద్యార్థులకు సీమోన్ అమృత్ ఫౌండేషన్ అధినేత అనిల్‌కుమార్ రగ్గులు పంపిణీ చేశారు. ‘విద్యార్థులు గజ..గజ’ శీర్షికన గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు.
రగ్గులు పంపిణీ చేసిన అధినేత అనిల్‌కుమార్
పాతగుంటూరు : హాస్టల్ విద్యార్థులకు సీమోన్ అమృత్ ఫౌండేషన్ అధినేత అనిల్‌కుమార్ రగ్గులు పంపిణీ చేశారు. ‘విద్యార్థులు గజ..గజ’ శీర్షికన గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. గుంటూరు పట్టాభిపురంలోని ఎస్సీ, బీసీ హాస్టల్‌ను సందర్శించి 50 మంది విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేశారు. అలాగే కళాశాలలో చదువుతూ హాస్టలో ఉంటున్న మరో 20 మందికి కూడా రగ్గులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలికి విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలుసుకుని ఇక్కడకు వచ్చానన్నారు.
చలికాలంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి రగ్గులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదిగి మరొకరికి సాయపడాలని సూచించారు. ‘సాక్షి’ కథనానికి దాతలు ముందుకు వస్తున్నారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూవో రాజదేవర, హాస్టల్స్ హెచ్‌డబ్ల్యూవోలు జితేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వియ్యన్నరావు సతీమణి జ్యోతి మరో 40 మంది విద్యార్థులకు దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. హాస్టల్ కిటికీలకు కర్టన్స్‌ను కూడా అందించారు.