
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు అదనపు న్యాయమూర్తు లకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వానికి వీరి హోదా గురించి సిఫారసు చేసింది.
జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారా యణ, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్ కె.సుజనలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న ప్రతిపాదనలకు కొలీజియం ఈ నెల 5వ తేదీనే ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
ఈ ముగ్గురు న్యాయ మూర్తులు 2023, జూలై 31న హైకోర్టు అద నపు న్యాయమూర్తులుగా నియమితులైన విష యం తెలిసిందే. కాగా, శాశ్వత న్యాయ మూర్తు లుగా జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్ కె.సుజన శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment