కనగానపల్లి (రాప్తాడు) : రామగిరి మండలం ఎగువపల్లి సమీపంలో ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన అనిల్‌కుమార్ (18) రామగిరిలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం పేరూరు నుంచి రామగిరికి ఆటోలో వస్తుండగా ఎగువపల్లి వద్ద ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. కుడివైపున కూర్చున్న అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని పేరూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.