వెంకన్న దర్శనానికి క్యూ కట్టిన వీఐపీలు | VIPs rush to tirumala on vaikunta ekadasi | Sakshi
Sakshi News home page

వెంకన్న దర్శనానికి క్యూ కట్టిన వీఐపీలు

Published Sat, Jan 11 2014 8:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

వెంకన్న దర్శనానికి క్యూ కట్టిన వీఐపీలు

వెంకన్న దర్శనానికి క్యూ కట్టిన వీఐపీలు

తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో  వీఐపీల తాకిడి పెరిగింది.   స్వామి వారి దర్శనానికి రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులు, సినీనటులు క్యూ కట్టారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డికే అరుణ, పార్దసారది, దానం నాగేందర్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రసాద్ కుమార్‌, బొత్స సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, కొండ్రుమురళి ఉన్నారు. వీరితోపాటు చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి తిరుమలకు  విచ్చేశారు.

అలాగే 32 మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలు తిరుమలలోనే ఉన్నారు. వీళ్లే కాకుండా 12 మంది ఐపీఎస్లు,10 మంది ఐఏఎస్లు దర్శనానికి వచ్చారు. ఇంకా తమిళనాడు,కర్నాటకా, మహారాష్ట్రా,పాండిచ్చేరికి చెందిన ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో వచ్చారు. వారికి ఏర్పాట్లు చేయడంలో టీటీడి అధికారులు తలమునకలయ్యారు. టీటీడీ అధికారులు  వీఐపీల సేవలో తరిస్తుంటే మరోవైపు సామాన్య భక్తులు వెంకన్న దర్శనానికి పడిగాపులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement