Vaikunta Ekadasi
-
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ రోజుతో 7 రోజుగా కొనసాగనుంది. నిన్న వైకుంఠ ద్వార దర్శనంలో 58,415 మంది భక్తులు దర్శించుకున్నారు.18,557 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.55 కోట్లు ఆదాయం వచ్చింది. ఆరు రోజుల్లో 3,95,983 మంది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆరు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 25.82 కోట్లు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1 వరకు పది రోజులపాటు కొనసాగనున్నాయి. -
Vaikunta Ekadasi: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి.. అశేష భక్త జనం నడుమ స్వర్ణరథంపై తిరుమలేశుడు (ఫొటోలు)
-
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. భక్త జనసందోహం (ఫొటోలు)
-
Tirumala Vaikunta Ekadasi Pics: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి దర్శనం కోసం భక్త జనసందోహం (ఫొటోలు)
-
వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక.. వీఐపీల తాకిడి వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్‌లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో.. మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. -
డిసెంబరు 22 నుండి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యేవరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, త్వద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులుకావాలని కోరారు. జేఈవో వెంట ఎస్ఈలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సుబ్రమణ్యం, ఐటి జిఎం శ్రీ సందీప్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, ఎవిఎస్వో శ్రీ నారాయణ తదితరులు ఉన్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ కట్టడికి టీటీడీ కొత్త ఆలోచన
-
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ
-
తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్లు పంపిణీ
-
వైకుంఠ ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శనాలు
-
గుంటూరు: మంగళగిరి పట్టణంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్న ఉత్తరాంధ్ర జిల్లావాసులు
-
ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
-
భద్రాచలం సీతారాముల సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు (ఫొటోలు)
-
తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి తిరుమల ముస్తాబు
తిరుమల: భూలోక వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో పది రోజులపాటు జరగనున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం భక్తులకు టీటీడీ సకల ఏర్పాట్లూ పూర్తిచేసింది. సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. \ వైకుంఠ ద్వార దర్శనం పురస్కరించుకుని తిరుమలలో 10 రోజుల ఉత్సవాల గురించి ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సర్వం సిద్ధమయ్యాయి. సోమవారం వేకువజామున ఒంటి గంట 45 నిమిషాల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభిస్తాం. అనంతరం ఉ.6 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి. ఈనెల 11వరకు 10 రోజుల పాటు జరిగే ఈ దర్శనాలు కొనసాగుతాయి. సామాన్య భక్తులకే ప్రాధాన్యత.. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో దాదాపు 94 కౌంటర్లను ఏర్పాటుచేసి టికెట్లు జారీచేస్తున్నాం. భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించడం కోసమే ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాం. టికెట్ కలిగిన భక్తులు నిర్దేశిత సమయం ప్రకారం తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్ట్ చేసుకోవాలి. రెండు లక్షలకు పైగా రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేశాం. మహాలఘు దర్శనం కోసం రోజూ 2,000 శ్రీవాణి టికెట్లను కూడా మంజూరు చేశాం. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సిఫారసు లేఖలు రద్దుచేశాం. తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. రెండు మూడు తేదీల్లో కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే దర్శనం కేటాయిస్తాం. ఇక తిరుమలలో వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు కూడా తిరుపతిలో ఉండి దర్శనానికి కేటాయించిన సమయం ప్రకారమే తిరుమలకి రావాలి. మూడు లక్షల 50 వేల లడ్డూల బఫర్ స్టాక్ ఉంచాం. అలాగే, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేదలు, గిరిజనులకు రోజూ వెయ్యి మందికి దర్శనం చేయిస్తాం. నిరంతరం అన్నప్రసాదం ఇక భక్తుల సౌకర్యార్థం అన్నదాన భవనంలో 10 రోజులు పాటు ఉ.6 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ చేస్తాం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లలో ఇతర ప్రాంతాల్లో వేచి ఉన్న భక్తులకు కూడా టీ, కాఫీ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తాం. ఏకాదశి సందర్భంగా రేపటి నుంచి పీఎస్సీ–4లో అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తాం. ఇక వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా రెండువేల మందితో భద్రత కల్పిస్తున్నాం. శ్రీవారి సేవకులు 3,500 మంది కూడా సేవలందిస్తారు. మాస్క్ తప్పనిసరి కోవిడ్ మళ్లీ వ్యాప్తిచెందుతుందన్న భయాందోళన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. తిరుమలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరులను దాదా 12టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాం. ఆలయం వెలుపల వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటుచేశాం. -
వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
-
వైభవంగా వైకుంఠ ఏకాదశి
తిరుమల/చంద్రగిరి: ఇల వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలు వెంటరాగా మలయప్ప దివి నుంచి భూవైకుంఠానికి వేంచేయడంతో సప్తగిరులు పులకించాయి. వైకుంఠం నుంచి వచ్చిన స్వామి దర్శనానికి ఉత్తరద్వారం స్వాగతం పలికింది. సుప్రీంకోర్టు సీజే దంపతులు, వివిధ రాష్ట్రాల హైకోర్టు సీజేలు, సుమారు 40 మంది జడ్జీలు, వీఐపీలు వేంకటేశ్వరుడిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. తిరుమలేశుని దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన అనంతరం అర్చకులు వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైకుంఠ ద్వారాలను తెరిచి పూజలు చేశారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ఈ ద్వారాలను తెరవడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండోసారి కూడా పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు సైతం గంట ముందుగానే 7.35 గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు. సామాన్యులు సైతం దేవదేవుడిని కనులారా వీక్షించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా దేవదేవుడు స్వర్ణరథాన్ని అధిరోహించి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగుతున్న సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వర్ణ రథం లాగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. జస్టిస్ రమణ దంపతులు వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి శ్రీవారి మూల మూర్తిని దర్శించుకున్నారు. అర్చకుల ఆశీర్వాదం అనంతరం టీటీడీ చైర్మన్ తీర్థప్రసాదాలను అందించారు. సీజేతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్, ఈవో స్వాగతం పలికి వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించగా టీటీడీ చైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు శ్రీవారి స్వర్ణరథ సేవలో పాల్గొని కొంతసేపు రథాన్ని లాగారు. ఆ తర్వాత వారు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థి దంపతులు కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు. తిరుమలకు తరలివచ్చిన వీఐపీలు తిరుమల శ్రీవారిని ఆలయ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరి జయరామ్, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు, ఆదిమూలపు సురేష్, బాలినేని, రంగనాథరాజు, ఎంపీలు భరత్, కొత్త ప్రభాకర్, వెంకటేష్, సత్యవతి, గురుమూర్తి, ఎం.వి.వి.సత్యనారాయణ, శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, వేమిరెడ్డి, ఎమ్మెల్యే రోజా, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ చెన్నై, న్యూఢిల్లీ స్థానిక సలహా మండళ్ల అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దర్శించుకున్నారు. నేడు చక్రస్నానం వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య చక్రస్నాన మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక హైకోర్టు సీజేలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థి దంపతులు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ రమేష్, జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ విజయలక్ష్మి, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోవిందరాజన్, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు సీజే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ గురువారం ఉదయం వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం హైకోర్టు సీజే, మంత్రి తలసాని కుటుంబ సభ్యులు వేర్వేరుగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, భాజపా నాయకురాలు డీకే అరుణలు శ్రీవారిని దర్శించుకున్నారు. -
Vaikunta Ekadasi 2022 : శ్రీవారి సేవలో పెద్దఎత్తున ప్రముఖులు
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారి సేవలో ప్రముఖులు
-
నల్గొండలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
స్వర్గాన్ని తలపిస్తోన్న తిరుమల
-
వైకుంఠవాసా.. నమో తిరుమలేశా!
ఉదయం: 4 గంటలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, కర్ణాటక సీజే రితురాజ్ అవస్థి, త్రిపురా హైకోర్టు సీజే జస్టిస్ అమర్నాథ్ గౌడ్, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాధ్ రాజు, మంత్రి గౌతమ్ రెడ్డి, కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరామ్, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, అప్పల్ రాజు, అనీల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యేలు రోజా, సంజీవయ్య, ఎంపీలు మార్గాని భారత్, కొత్త ప్రభాకర్, వెంకటేష్, సత్యవతి, గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్‌ఉమేష్ లలిత్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. తిరుమల/సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినానికి తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దాదాపు 12 టన్నుల పుష్ప తోరణాలు, వివిధ రకాల పండ్లతో శ్రీవారి ఆలయం, అనుబంధ ఆలయాలు, పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీప కాంతులతో తిరుమల ప్రకాశిస్తోంది. వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్‌ఉమేష్ లలిత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి తిరుమల చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి తరువాత 1.45 గంటల నుంచి.. బుధవారం అర్ధరాత్రి తరువాత 1.45 గంటల నుంచి ఆలయంలోని వైకుంఠద్వారాలు (ఉత్తర ద్వారాలు) తెరుచుకోనున్నాయి. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 10 రోజులపాటు భక్తులకు ఉత్తరద్వారం నుంచి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం వేకువన తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాన్ని నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్ర దీపాలంకరణ సేవ జరగనుంది. అనంతరం స్వామి ఉభయ దేవేరులతో కలిసి తిరుచ్చిపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. శుక్రవారం ద్వాదశి రోజున ఏకాంతంగా చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వారును మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం వద్ద కొలువుదీర్చి విశేష పూజలు చేస్తారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడం లేదని టీటీడీ ప్రకటించింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పుష్పాలతో అలంకరించిన శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం శ్రీవారి ఏకాంతసేవలో సుప్రీంకోర్టు సీజే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం రాత్రి తిరుమల శ్రీవారిని ఏకాంతసేవలో దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద పుష్పగుచ్ఛంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి తదితరులు స్వాగతం పలికారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా తదితరులున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో జస్టిస్ ఎన్వీ రమణకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహంలో జస్టిస్ ఎన్వీ రమణతో మాట్లాడుతున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ,ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వైష్ణవాలయాలు ముస్తాబు ముక్కోటి ఏకాదశి వేడుకలకు రాష్ట్రంలోని వైష్ణవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. శ్రీవేంకటేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి తదితర వైష్ణవ సంప్రదాయ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశిని పెద్ద పండుగగా నిర్వహించడం సంప్రదాయం. అన్ని వైష్ణవ ఆలయాల్లోను గురువారం వేకువజాము నుంచి ఉత్తరద్వార దర్శనాలకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమలతోపాటు ద్వారకా తిరుమల, సింహాచలం, వేదాద్రి, అంతర్వేది, అప్పనపల్లి, నరసాపురంలోని జగన్నాథస్వామి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
స్వర్గంలో నడిచినట్టు ఉంది: ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ద్వారంలో నడవటం స్వర్గంలో నడిచిన అనుభూతి కలిగిందని అన్నారు. రాబోయే 2021లో అందరి కష్టాలు తీరి శుభం కలగాలని కోరుకున్నాని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, సీఎం వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండి 30 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా దీవెనలు ఇవ్వాలని ప్రార్ధించామని రోజా చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపైన ఆమె విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు చిన్న మెదడు చిట్లినట్టు ఉందని, అందుకే అర్థం లేని వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. భక్తులపై లాఠీ చార్జీ టీటీడీ ఎన్నడూ చేయలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, కోవిడ్ నిబంధనలు పాటిస్లూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తోందని ప్రశంసించారు.