తిరుమల: రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల కొండ శనివారం భక‍్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ లక్షమందికి పైగా భక్తులు తిరుమల చేరుకున్నారు. సాయంత్రం మరో లక్షమంది భక్తులు చేరుకునే అవకాశం ఉంది. కాగా ఉత్తర ద్వార దర్శనం కోసం వైకుంఠం-2లో ఏర్పాటు చేసిన 31 కంపార్టుమెంట‍్లన్నీ భక్తులతో నిండిపోయి బయట కిలోమీటర్ల మేర క‍్యూ ఏర‍్పడింది.
చదవండి...(తిరుమల.. దివ‍్య దర‍్శనం టోకెన‍్ల రద్దు)
దీంతో తాత్కాలికంగా మరో ఐదు కంపార్ట్‌మెంట్లను టీటీడీ ఏర్పాటు చేసింది. అలాగే ఏకాదశి నాడు స్వర్ణరథం, ద్వాదశి రోజున చక్రస్నానం సందర్భంగా నారాయణగిరి పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 8,9 తేదీల్లో ఆర్జిత, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నేటి నుంచి రెండురోజుల పాటు దివ్యదర్శనం అమల్లో ఉంటుంది. అలాగే ముందస్తు గదుల బుకింగ్‌ను కూడా నిలిపివేసింది.