uttara dwara dharsanam
-
తిరుమలలో ముగిసిన ఉత్తరద్వార దర్శనాలు
-
తిరుపతికి పెద్దసంఖ్యలో తరలి వస్తున్న భక్తులు
-
వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి తిరుమల ముస్తాబు
తిరుమల: భూలోక వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో పది రోజులపాటు జరగనున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం భక్తులకు టీటీడీ సకల ఏర్పాట్లూ పూర్తిచేసింది. సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. \ వైకుంఠ ద్వార దర్శనం పురస్కరించుకుని తిరుమలలో 10 రోజుల ఉత్సవాల గురించి ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సర్వం సిద్ధమయ్యాయి. సోమవారం వేకువజామున ఒంటి గంట 45 నిమిషాల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభిస్తాం. అనంతరం ఉ.6 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి. ఈనెల 11వరకు 10 రోజుల పాటు జరిగే ఈ దర్శనాలు కొనసాగుతాయి. సామాన్య భక్తులకే ప్రాధాన్యత.. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో దాదాపు 94 కౌంటర్లను ఏర్పాటుచేసి టికెట్లు జారీచేస్తున్నాం. భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించడం కోసమే ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాం. టికెట్ కలిగిన భక్తులు నిర్దేశిత సమయం ప్రకారం తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్ట్ చేసుకోవాలి. రెండు లక్షలకు పైగా రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేశాం. మహాలఘు దర్శనం కోసం రోజూ 2,000 శ్రీవాణి టికెట్లను కూడా మంజూరు చేశాం. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సిఫారసు లేఖలు రద్దుచేశాం. తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. రెండు మూడు తేదీల్లో కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే దర్శనం కేటాయిస్తాం. ఇక తిరుమలలో వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు కూడా తిరుపతిలో ఉండి దర్శనానికి కేటాయించిన సమయం ప్రకారమే తిరుమలకి రావాలి. మూడు లక్షల 50 వేల లడ్డూల బఫర్ స్టాక్ ఉంచాం. అలాగే, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేదలు, గిరిజనులకు రోజూ వెయ్యి మందికి దర్శనం చేయిస్తాం. నిరంతరం అన్నప్రసాదం ఇక భక్తుల సౌకర్యార్థం అన్నదాన భవనంలో 10 రోజులు పాటు ఉ.6 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ చేస్తాం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లలో ఇతర ప్రాంతాల్లో వేచి ఉన్న భక్తులకు కూడా టీ, కాఫీ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తాం. ఏకాదశి సందర్భంగా రేపటి నుంచి పీఎస్సీ–4లో అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తాం. ఇక వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా రెండువేల మందితో భద్రత కల్పిస్తున్నాం. శ్రీవారి సేవకులు 3,500 మంది కూడా సేవలందిస్తారు. మాస్క్ తప్పనిసరి కోవిడ్ మళ్లీ వ్యాప్తిచెందుతుందన్న భయాందోళన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. తిరుమలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరులను దాదా 12టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాం. ఆలయం వెలుపల వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటుచేశాం. -
‘టిప్పు సుల్తాన్ పిలిస్తే పలికిన... రంగనాథుడు!’
సాక్షి, మద్దికెర (కర్నూలు): మండల పరిధిలోని పెరవలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథుడు పిలిస్తే పలికే దేవుడిగా నిత్యం పూజలందు కుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఒకరోజు మాత్రమే మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటా రు. అయితే పెరవలి శ్రీరంగనాథుడు సతీసమేతంగా 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భాగ్యం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠంలోని శ్రీమహావిష్ణువును దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ నెల 13 తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోనున్నారు భక్తులు. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు గరుఢ వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సతీసమేతంగా గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ మల్లికార్జున, దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆలయ చరిత్ర : స్వతహా వైకుంఠ ద్వారం కలిగిన ఈ ఆలయంలో రంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవి సతీసమేతుడై పూజలందుకుంటూ నిత్యం ఉత్తరద్వార దర్శన మిస్తున్నారు. స్వామివారు ద్వాదశ అళ్వారులతో వెలిసిన వైష్ణవ క్షేత్రం. తపమాచరించిన రుషుల దర్శనార్థం శ్రీ మన్నారాయణుడే కపిల మహర్షి అవతారమెత్తి ఇచ్చట సాల గ్రామం ఇచ్చట ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తదుపరి విజయనగరరాజులు హరిహరరాయలు, బుక్కరాయలు క్రీ.శ. 1336–37 సంవత్సరంలో దేవాలయం నిర్మించడంతోపాటు ఆలయ నిర్వహణకు వెయ్యి ఎకరాల మాన్యం ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు : ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏటా ఫల్గుణ శుద్ధ ద్వాదశి నుంచి బహుళ సప్తమి వరకు బ్రహోత్సవాలు జరుగుతాయి. కర్ణాటకలోని శ్రీరంగ పట్టణం రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాన్ దండయాత్రలు చేసుకుంటూ ఒకరోజు ఇక్కడి వచ్చారని నానుడి. ఆలయాన్ని ధ్వంసం చేయబోయిన టిప్పు సుల్తాన్‌కు స్వామివారు శక్తిమంతుడని ప్రజలు చెప్పారట. ఈ మేరకు స్వామివారిని పరీక్షించేందుకు ఆయన శ్రీరంగనాథా అని పిలువగా ఓయ్ అంటూ పలికారని నానుడి. దీంతో టిప్పు సుల్తాన్ స్వామివారిని దర్శించుకుని తన అశ్వం ఎంతవరకు పరిగెడితే అంతవరకు స్వామివారికి భూమి ఇచ్చాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. -
Vaikuntha Ekadashi: ఉత్తర ద్వార దర్శనం లేదు
సాక్షి, నల్లకుంట (హైదరాబాద్): ఈ నెల 13న (గురువారం) ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ముక్కోటి ఏకాదశి రోజున న్యూ నల్లకుంటలోని సీతారామాంజనేయ సరస్వతీదేవి ఆలయంలో ఉత్తరద్వార దర్శనం ఉండదని ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేయించాలనుకునే భక్తులు ఆలయ గుమస్తా వద్ద టికెట్టు తీసుకుంటే వారు భక్తుల గోత్ర నామాలపై పూజలు నిర్వహిస్తారని ఈవో తెలిపారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాల్లో తీర్థ, ప్రసాద వితరణ కూడా నిషేధమని చెప్పారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులు కూర్చోవడానికి కూడా అనుమతి లేదని తెలిపారు. వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు భక్తులు సహకరించాలని సూచించారు. భక్తులకు అనుమతి లేదు.. జగద్గిరిగుట్ట: రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జగద్గిరిగుట్టలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి, 14న గోదాదేవి కల్యాణం నేపథ్యంలో భక్తులకు దర్శనములు నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆదేశానుసారం శాస్త్రోయుక్తంగా కేవలం వేద పండితులు, సిబ్బంది సమక్షంలో అంతరంగికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: కరోనా థర్డ్ వేవ్.. వైరస్ పడగలో వీఐపీలు -
రంగ రంగ వైభవం.. 19 ఏళ్లకు ఓ సారి
‘రంగ.. రంగ’ నామస్మరణతో శ్రీరంగం పులకించింది. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథస్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): 108 వైష్టవ క్షేత్రాల్లో రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 19 ఏళ్లకు ఓ సారి వైకుంఠ ఏకాదశి వేడుకలు మార్గశిర మాసంలో కాకుండా కార్తిక మాసం ఏకాదశిలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది మనవాళ మహామునుల నియమావళి ప్రకారం తైపూసంలో వార్షిక ఉత్సవాలను సైతం ముగించాల్సి ఉంది. దీంతో కార్తిక మాసంలో అధ్యయన ఉత్సవం వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి అత్యంత వేడుకగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ముఖ్యఘట్టం వైకుంఠ ద్వార ప్రవేశం మంగళవారం కనుల పండువగా జరిగింది. బారులు తీరిన భక్తులు సోమవారం నుంచి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం వేకువజామున ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజల అనంతరం 4.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరిచారు. మూల స్థానం నుంచి స్వామివారు ప్రత్యేక అలంకరణలో పరమపద మార్గం వైపుగా ముందుకు సాగారు. రంగ .. రంగ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయితే స్వామివారి స్వర్గ ద్వార ప్రవేశం సమయంలో ఆలయ అధికారులు, అర్చకులు మాత్రమే ఉన్నారు. భక్తులను అనుమతించ లేదు. బయట ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. దేవదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, తిరుచ్చి జిల్లా కలెక్టర్ శివరాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం 7 గంటల అనంతరం భక్తులను స్వామివారి దర్శనార్థం అనుమతించారు. అప్పటికే కి.మీ కొద్ది భక్తులు ఆలయ పరిసరాల్లో బారులు తీరారు. కరోనా నిబంధనలను అనుసరించి భక్తులను అనుమతించారు. -
భక్తుల రద్దీతో తిరుమల కిటకిట
-
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
తిరుమల: రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల కొండ శనివారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ లక్షమందికి పైగా భక్తులు తిరుమల చేరుకున్నారు. సాయంత్రం మరో లక్షమంది భక్తులు చేరుకునే అవకాశం ఉంది. కాగా ఉత్తర ద్వార దర్శనం కోసం వైకుంఠం-2లో ఏర్పాటు చేసిన 31 కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడింది. చదవండి...(తిరుమల.. దివ్య దర్శనం టోకెన్ల రద్దు) దీంతో తాత్కాలికంగా మరో ఐదు కంపార్ట్మెంట్లను టీటీడీ ఏర్పాటు చేసింది. అలాగే ఏకాదశి నాడు స్వర్ణరథం, ద్వాదశి రోజున చక్రస్నానం సందర్భంగా నారాయణగిరి పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 8,9 తేదీల్లో ఆర్జిత, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నేటి నుంచి రెండురోజుల పాటు దివ్యదర్శనం అమల్లో ఉంటుంది. అలాగే ముందస్తు గదుల బుకింగ్‌ను కూడా నిలిపివేసింది.