వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తులు బుధవారం నుంచే పోటెత్తారు. గురువారం.. కొత్త సంవత్సరం.. జనవరి ఒకటో తేదీ.. వైకుంఠ ఏకాదశి అన్నీ కలిసి రావడంతో సామాన్య భక్తులు, వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.
తమను బుధవారం ఉదయం నుంచే వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతించాలని భక్తులు తిరుమలలోని సీజీసీ వద్ద ఆందోళనకు దిగారు. అయితే.. బుధవారం సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే భక్తులను వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. దాంతో అధికారులకు, భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం.. తిరుమలలో ఆందోళన
Published Wed, Dec 31 2014 11:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM
Advertisement