Queue lines
-
తిరుమలలో భక్తుల రద్దీ అప్డేట్స్..
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్మెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని 66,233 మంది దర్శించుకున్నారు. నిన్న(శుక్రవారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.71కోట్లుగా ఉంది. తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 14న అంకురార్పణ, అక్టోబర్ 15–23 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. #తిరుమల తిరుమలలో నేటి పౌర్ణమి గరుడ సేవ#Tirumala Today's Paurnami Garuda Seva at Tirumala pic.twitter.com/S1hLwjC6z2 — kshetradarshan (@kshetradarshan) September 29, 2023 ఇదిలా ఉండగా.. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. -
మధ్యప్రదేశ్ కోవిడ్ మరణాలు దాస్తోందా ?
ఒకవైపు చూస్తుంటే ఆస్పత్రుల్లో శవాల గుట్టలు.. అంత్యక్రియల కోసం కిలో మీటర్ల కొద్దీ క్యూ లైన్లు.. అయినవారికి ఆఖరి వీడ్కోలు పలకడానికి దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఎదురుచూపులు.. భోపాల్, రాయ్‌పూర్, అహ్మదాబాద్, ముంబై ఎక్కడ చూసినా ఇదే దుస్థితి.. ప్రభుత్వాల అధికార లెక్కలకి, చితి మంటలపై కాలుతున్న శవాల సంఖ్యకి పొంతన లేదు. భోపాల్: భోపాల్ గ్యాస్ దుర్ఘటన గుర్తుంది కదా? వేలాది మంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న విషవాయువు కల్లోలం. ఇప్పుడు కరోనా అదే విధంగా మధ్యప్రదేశ్‌లో ప్రజల ప్రాణాల్ని తీస్తోంది. అప్పట్లో ఏ స్థాయిలో శ్మశానాల దగ్గర అంత్యక్రియల కోసం క్యూలు ఉండేవో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని భడ్‌భాడా శ్మశాన వాటిక దగ్గర కోవిడ్ –19 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఇక్కడకి గంటకి 30–40 మృతదేహాలను తీసుకువస్తున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంబులెన్స్‌లు రోడ్డు మీదకి కొన్ని కిలోమీటర్ల వరకు లైనులో ఉన్నాయి. ‘‘మా బావగారు కరోనా మరణించడంతో ఇక్కడికి వచ్చాం. నాలుగైదు గంటలు వేచి చూసినా అంత్యక్రియలకు జాగా దొరకలేదు’’అని సంతోష్ రఘువంశి చెప్పారు. లెక్కల్లో ఎంతో తేడా ..! మధ్యప్రదేశ్‌లో నమోదవుతున్న మరణాలను ప్రభుత్వం అధికారికంగా చెప్పడం లేదనే అనుమానాలున్నాయి. సోమవారం కరోనాతో రాష్ట్రంలో 37 మంది మరణించారని అధికారిక లెక్కలు చెబుతూ ఉంటే, భోపాల్‌లో భడ్‌భాడా శ్మశానవాటికలోనే 37 మంది కోవిడ్ రోగులకి అంత్యక్రియలు జరిగాయి.. ఏప్రిల్ 8న 41 మంది కోవిడ్ రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తే, రాష్ట్రవ్యాప్తంగా 27 మందే మరణించారని ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా ఏప్రిల్ 10న భోపాల్‌లో 56 మృతదేహాలకు అంతిమ సంస్కారం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 24 మందే మరణించారని ప్రభుత్వ గఱాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 11న 68 కి అంత్యక్రియలు జరిగితే ప్రభుత్వం 24 అని, ఏప్రిల్ 12న 59ని దహనం చేస్తే ప్రభుత్వం 37 మరణించారని వెల్లడించింది. కోవిడ్ మృతుల అంశంలో తాము అన్నీ నిజాలే చెబుతున్నామని ప్రభుత్వం అంటోంది. అంత్యక్రియల కోసం క్యూలు పెరగడానికి కలప దొరకకపోవడమే కారణమని రాష్ట్ర వైద్య విద్య మంత్రి విశ్వాస్ సారంగ్ చెప్పారు. రోజుకి 40 నుంచి 45 మృతదేహాలను దహనం చేయాల్సి రావడంతో తాము చాలా ఒత్తిడికి లోనవుతున్నామని శ్మశాన వాటికలో పని చేసే ప్రదీప్ కానోజియా చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్ ,ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ శ్మశాన వాటికలకు ఇస్తున్న సమాచారానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గణాంకాలకి పొంతన కుదరడం లేదు. ప్రభుత్వాలు కరోనా మరణాలను దాచి పెడుతున్నాయన్న సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క కరోనా రోగుల అవస్థలు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరాలనుకునే వారు బెడ్స్ దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ, పాట్నా, బెంగుళూరు, అహ్మదాబాద్, ముంబై, పుణెలలో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. సామర్థ్యానికి మించి కోవిడ్ పేషెంట్లు వచ్చి చేరుతున్నారు. పట్నా ఎయిమ్స్ ఆస్పత్రిలో 112 బెడ్స్ నిండిపోయాయి. రుబాన్ ఆస్పత్రుల్లో 95 బెడ్స్ నిండిపోవడంతో కొత్త పేషెంట్లకు అవకాశం లేదు. ఫోర్డ్ ఆస్పత్రిలో 55 పడకలు, పరాస్ ఆస్పత్రిలో 48 పడకలు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. ఢిల్లీలోని కోవిడ్ రోగుల ప్రత్యేక ఆస్పత్రి లోక్‌నాయక్ ఆస్పత్రి, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒక్క బెడ్ కూడా ఖాళీగా లేదు. ఢిల్లీ ఆస్పత్రుల్లో 1177 బెడ్స్‌కి గాను 79 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులు అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిపడా సిబ్బంది కూడా లేరు. బెంగళూరులోని కొన్ని ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకకపోవడంతో ఆస్పత్రి బయట ఉన్న బెంచీలపైనే రోగులు పడుకుంటున్నారు. పుణేలో కారిడార్లలోనే పేషెంట్లకు చికిత్స చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్‌లోని జహగిరిపురా శ్మశాన వాటిక ముందు బారులు తీరిన మృతదేహాలతో కూడిన అంబులెన్స్‌లు గుజరాత్లో రేయింబగళ్లు అంత్యక్రియలు సాధారణ పరిస్థితుల్లో హిందువులు సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరు. కానీ కోవిడ్‌తో అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లలో చేసేదేమీ లేక రాత్రి పూట కూడా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కేవలం సూరత్‌లోనే రాత్రిళ్లు 25 వరకు శవాలను దహనాలు చేస్తున్నారు. వడోదరాలో కూడా అదే పరిస్థితి నెలకొందని మున్సిపల్ చైర్మన్ హితేంద్ర పటేల్ చెప్పారు. రాయపూర్‌లో కొత్తగా క్రిమేషన్ సెంటర్లు కోవిడ్–19 మృతదేహాలకు అంత్య క్రియలు నిర్వహించలేక ఆస్పత్రులోనే గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉన్న వీడియో వైరల్ కావడంతో ఆ రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రిక్ క్రిమేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కేవలం రాయపూర్‌లోనే ఒకేరోజు 150 మంది వరకు కరోనాతో మరణించారు. మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో కొత్తగా 14 ఎలక్ట్రిక్ క్రిమేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. -
40 రోజులైనా మారని నోట్ల కష్టాలు
-
జియో సిమ్ కోసం కస్టమర్ల క్యూ..
దేశవ్యాప్తంగా అనూహ్య డిమాండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : యాపిల్ ఫోన్ల కోసం క్యూలు కట్టడం ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైంది. ఇప్పుడు రిలయన్స్ జియో ప్రవేశంతో ఆ ట్రెండ్ భారత్‌లోనూ ప్రస్ఫుటమవుతోంది. అయితే ఇక్కడ దర్శనమిస్తున్న క్యూలైన్లు మొబైల్ ఫోన్ల కోసం కాదు. జియో ఇచ్చే ఉచిత సిమ్ల కోసం. సిమ్ చేతికొచ్చిందా జియో ప్రివ్యూ ఆఫర్‌తో 90 రోజులపాటు అపరిమిత డేటా, కాల్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇంకేముంది దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్లు, లైఫ్ మొబైల్ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్లు స్వాగతం పలుకుతున్నాయి. 4జీ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత సిమ్‌తోపాటు ప్రివ్యూ ఆఫర్‌ను వర్తింపజేస్తుండడంతో కస్టమర్లతో ఈ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి. నల్ల బజారులో రూ.2 వేలకు..: ప్రివ్యూ ఆఫర్ కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. తొలుత రిలయన్స్ ఉద్యోగులు, వారి బంధువులకు.. ఆ తర్వాత లైఫ్ స్మార్ట్‌ఫోన్ కొన్న కస్టమర్లకు 90 రోజులపాటు ప్రివ్యూ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోకపోయినా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్‌ను విస్తరించింది. ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి కస్టమర్ ప్రివ్యూ ఆఫర్‌కు అర్హులు. దీంతో దేశవ్యాప్తంగా కస్టమర్లు సిమ్ల కోసం ఎగబడ్డారు. వినియోగదార్లు ఒకేసారి స్టోర్లను చుట్టుముట్టడంతో సిమ్ల కొరత కూడా తలెత్తింది. కొందరు కస్టమర్లు ఇదే అదనుగా రూ.1,500-2,000లకు సిమ్‌లను తిరిగి విక్రయిస్తున్నట్టు సమాచారం. సిమ్‌లు పక్కదారి పట్టకుండా అసలైన కస్టమర్లకే చేరేలా కంపెనీ కసరత్తు చేస్తోంది. క్యూ కట్టిన కంపెనీలు.. హైదరాబాద్‌లో 50 లక్షలకుపైగా 4జీ మొబైల్ వినియోగదార్లు ఉన్నారు. గురువారం ఒక్కరోజు బిగ్ సి స్టోర్లలో 2,500లకుపైగా, లాట్ మొబైల్స్ ఔట్లెట్లలో అదే స్థాయిలో 4జీ స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యా యి. 4జీ ఫోన్ కొన్న వినియోగదార్లకు ఈ స్టోర్లలో అప్పటికప్పుడు సిమ్‌ను జారీ చేస్తున్నారు. ఇక జియో బండిల్ ఆఫర్‌ను అందించేందుకు మొబైల్ ఫోన్ కంపెనీలు క్యూ కట్టాయి. జియోతో తొలుత శామ్సంగ్, ఎల్జీ.. తర్వాత జియోనీ, కార్బన్, లావా, ఆసస్, టీసీఎల్, ఆల్కటెల్, ప్యానాసోనిక్, మైక్రోమ్యాక్స్, యూ వంటి బ్రాండ్లు చేతులు కలిపాయి. ఈ స్థాయిలో బండిల్ ఆఫర్ రావడం దేశంలో ఇదే తొలిసారి. శామ్సంగ్ తాజాగా రూ.4,590లకే జెడ్2ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. జియో సేవల నేపథ్యంలో ఫీచర్ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికే ఈ ధరలో జెడ్2ను తీసుకొచ్చింది. -
అసలు కారణం ఏంటంటే..
రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట వెనుక అంతులేని ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. పుష్కరాలను కేవలం ఒక ప్రచార కార్యక్రమంలా ప్రభుత్వం భావించడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులను, నిపుణులను భాగస్వాములను చేయకపోవడం ప్రభుత్వం అలసత్వాన్ని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం ఎందుకు జరిగిందంటే 250 మీటర్లు పొడవున్న పుష్కర ఘాట్‌కు ఉదయం 4.30 గంటల ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి మహిళలు, చిన్నారులతో వేల కుటుంబాలు అక్కడ చేరుకున్నాయి. ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరఘాట్‌కు వస్తుండడంతో వేలసంఖ్యలో చేరుకున్న భక్తులందర్నీ అధికారులు ఆపేశారు. గేట్లన్నింటినీ మూసేశారు. సీఎం చంద్రబాబు ఉదయం 6 నుంచి 7:30 వరకూ అంటే దాదాపు గంటన్నరసేపు అక్కడే గడిపారు. చంద్రబాబు ఉన్నంతవరకూ మొత్తం రాకపోకలను బంద్‌చేశారు. ఉదయం 4:30 గంటలకే వచ్చిన భక్తులంతా క్యూలైన్లలో ఉన్నారు. మంచినీళ్లు లేవు గంటల తరబడి క్యూలో ఉన్న భక్తులకు కనీసం సౌకర్యాలు లేకుండా పోయాయి. 12 లక్షల మంచినీళ్లు ప్యాకెట్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అవి భక్తులకు చేరలేదు. దాహం తట్టుకోలేక, గంటల తరబడి నిలబడలేక నీరసించిపోయారు. చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. టాయిలెట్లు ఉన్నా.. వాటికి నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు, పెద్దలు బాగా ఇబ్బంది పడ్డారు. సీఎం చంద్రబాబు ఘాట్ నుంచి వెళ్లిపోగానే గేట్లు తెరిచారు. మొత్తం మూడు ఎంట్రీల నుంచి ఒక్కసారిగా ఘాట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వెనుక ఉన్నవారు కూడా నెట్టుకుంటూ ముందుకురావడం ప్రమాదానికి దారితీసింది. ఘాట్ మెట్లపై కొంతమంది- జనం కాళ్లకింద నలిగిపోయారు. తోపులాటతో చాలామంది .. కింద గోదావరిలో స్నానాలు చేస్తున్నవారిపై పడ్డారు. దీంతో స్నానాలు చేస్తున్నవారు నీళ్లలో మునిగి, పైకి లేవలేక, ఊపిరాడక మరణించారు. కాపాడేవారు లేక కుటుంబ సభ్యుల రోదనలతో పుష్కరఘాట్ కన్నీటి పర్యంతమైంది. చికిత్స అందక హాహాకారాలు తొక్కిసలాట పెద్ద ఎత్తున చోటుచేసుకోవడంతో.. అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. రక్షించేందుకు పోలీసులు, నియంత్రించేందుకు సిబ్బంది... శక్తి, సామర్థ్యాలు సరిపోలేదు. ఒకచోట నుంచి మరో చోటకు వచ్చి .. బాధితులకు సహాయం చేద్దామన్నా.. ముందుకూ, వెనక్కి వెళ్లలేని పరిస్థితి. పుష్కర్‌ఘాట్ వద్ద ఉన్న మూడు అంబులెన్సులలో బాధితులను తరలించడం కష్టమైపోయింది. మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం, క్షతగాత్రులు కూడా పదుల్లో ఉండటంతో.. అప్పటికప్పుడు వారికి సాయం చేయడం అధికారుల వల్ల కాలేదు. అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో తొక్కిసలాట జరిగిన రెండు గంటలవరకూ మృతదేహాలు.. ఘటనా స్థలం వద్దే ఉండిపోయాయి. ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో సరైన సమాచారం రాకుండా పోయింది. సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ఇది పెద్ద అవరోధంగా మారింది. లెక్కలు తప్పాయా? గోదావరి పుష్కరాలపై విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రభుత్వం - భక్తులకు ఏర్పాట్లు, రక్షణ, భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు వహించలేదన్నది నిపుణుల అభిప్రాయం. తొక్కిసలాట ఘటన వెనుక కూడా అధికారుల అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని వారు అంటున్నారు. రాజమండ్రిలో గోదావరి తీరాన 27 ఘాట్లు ఉన్నాయి. వీటిలో కోటిలింగాల ఘాట్ దాదాపు కిలోమీటరన్నర పొడవు ఉంటుంది. తొక్కిసలాట జరిగిన పుష్కరఘాట్ పొడవు విస్తరణ తర్వాత కూడా కేవలం 170 మీటర్లే. ఇక గౌతమీ ఘాట్ పొడవు 170 మీటర్లు. మొత్తంమీద రాజమండ్రిలో ఘాట్ల పొడవు 2400 మీటర్లు. నీటిపారుదల శాఖ అధికారుల అంచనా ప్రకారం ఏకకాలంలో 20 లక్షల మంది స్నానాలు చేసే అవకాశం ఉంది. 10 నిమిషాల సమయంలో ఒక చదరపు మీటరు స్థలంలో 60 మంది స్నానాలు చేయొచ్చని లెక్కలు ఇచ్చారు అధికారులు. బహుశా ఈ లెక్కలే తప్పి ఉండవచ్చనేది నిపుణుల అభిప్రాయం. వ్యవస్థలు నిస్తేజం సాధారణంగా పుష్కరాల లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గోదావరి పుష్కరాలకు రోజూ 7 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఏర్పాట్లు మాత్రం నాసిరకంగా ఉన్నాయి. ఎంతమంది వస్తున్నారు, ఏ ఘాట్ వద్ద ఎంతమంది ఉన్నారు వంటి విషయాలను అంచనావేయడంలో అధికారులు పూర్తి వైఫల్యం చెందారని తాజా ఘటన వెల్లడిస్తోంది. భక్తుల రద్దీపై తగిన సమాచారం తెప్పించుకుని ఆమేరకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం, యంత్రాంగం వైఫల్యం చెందిందనే విమర్శలు వస్తున్నాయి. - హరీష్, సీనియర్ కరస్పాండెంట్, సాక్షి టీవీ రాజమండ్రి -
తిరుమల క్యూలైన్లలో తోపులాట.. భక్తులకు గాయాలు
వారాంతపు సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొత్తం కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు రెండు కిలోమీటర్ల మేర నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులు తోపులాటకు దిగడంతో పలువురు భక్తులకు గాయాలు కూడా అయ్యాయి. తిరుమల క్యూలైన్ల నిర్వహణపై ఇంతకుముందు నుంచి పలు ఫిర్యాదులు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలవుదినాలు, పరీక్షల ఫలితాలు వచ్చిన సందర్భాలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరుగుతుంది. కానీ దానికి తగిన ఏర్పాట్లను టీటీడీ చేయలేకపోతోందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు కూడా అలాగే క్యూలైన్లు నిండటంతో భక్తులు తోపులాటకు దిగారు. -
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం.. తిరుమలలో ఆందోళన
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తులు బుధవారం నుంచే పోటెత్తారు. గురువారం.. కొత్త సంవత్సరం.. జనవరి ఒకటో తేదీ.. వైకుంఠ ఏకాదశి అన్నీ కలిసి రావడంతో సామాన్య భక్తులు, వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తమను బుధవారం ఉదయం నుంచే వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతించాలని భక్తులు తిరుమలలోని సీజీసీ వద్ద ఆందోళనకు దిగారు. అయితే.. బుధవారం సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే భక్తులను వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. దాంతో అధికారులకు, భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. -
రేపటి దర్శనం కోసం.. తిరుమలలోఆందోళన
-
తిరుమలలో భారీ వర్షం
తిరుపతి: తిరుమలలో గత అర్థరాత్రి నుంచి ఎడతేరపి లేకుండా భారీగా వర్షం కురుస్తుంది. దాంతో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు రహదారులన్నీ పూర్తిగా జలమయమైనాయి. వారాంతపు సెలవులు రావడంతో తిరుమల భక్తులతో కిక్కిరిపోయింది. రద్దీ అధికంగా ఉండటంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి... భక్తులు రోడ్లపైకి బారులు తీరారు. సరైన క్యూలైన్లు లేకపోవడంతో భక్తులు వర్షంలో తడుస్తున్నారు. అలాగే గదులు లభించక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి, భోజన, తల నీలాల కేంద్రాల వద్ద భక్తులతో క్యూ లైన్లు భారీగా ఉంది.