తిరుపతి: తిరుమలలో గత అర్థరాత్రి నుంచి ఎడతేరపి లేకుండా భారీగా వర్షం కురుస్తుంది. దాంతో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు రహదారులన్నీ పూర్తిగా జలమయమైనాయి. వారాంతపు సెలవులు రావడంతో తిరుమల భక్తులతో కిక్కిరిపోయింది. రద్దీ అధికంగా ఉండటంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి... భక్తులు రోడ్లపైకి బారులు తీరారు.
సరైన క్యూలైన్లు లేకపోవడంతో భక్తులు వర్షంలో తడుస్తున్నారు. అలాగే గదులు లభించక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి, భోజన, తల నీలాల కేంద్రాల వద్ద భక్తులతో క్యూ లైన్లు భారీగా ఉంది.