సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు బస, దర్శనం ఏర్పాట్లను టీటీడీ సిద్ధం చేసింది. సర్వదర్శనం, కాలిబాట భక్తుల దివ్యదర్శనం, వీఐపీ దర్శనం, నిర్దేశిత దర్శన సమయాలు, భక్తులను అనుమతించే వేళలను టీటీడీ ప్రకటించింది. అవసరాన్ని బట్టి అరగంట అటుఇటుగా దర్శనానికి అనుమతిస్తామని ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.
అందరికీ లఘుదర్శనమే..
ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మంత్రులు, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితర ప్రముఖులను వేకువజామున 1.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. అందరికీ లఘు దర్శనం మాత్రమే. ఎటువంటి హారతి ఇవ్వరు. ఒక్కో వీఐపీ తరఫున ఆరుగురిని మాత్రమే అనుమతి స్తారు. టికెట్టు ధర రూ.1000గా నిర్ణయించారు. ప్రతి భక్తుడికి ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి. సిఫారసులను అనుమతించరు. వ్యక్తిగతంగా వస్తేనే అనుమతిస్తారు. అం దరూ సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి.
కాలిబాటల్లో నడిచి వచ్చే భక్తులకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు అలిపిరి మార్గంలోని గాలిగోపురం వద్ద, శ్రీవారి మెట్టు మార్గాల్లో రెండు రోజులకు కలిపి మొత్తం 40 వేల టికెట్లు ఇస్తారు. వీరిని శుక్రవారం అర్ధరాత్రి తర్వాతే నారాయణగిరి ఉద్యావనంలో ఏర్పాటు చేసిన క్యూ లోకి అనుమతిస్తారు. శనివారం ఉదయం 7 గంటల తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.
సర్వదర్శనం భక్తులను శుక్రవారం సా యంత్రం 5 గంటల నుంచి ఎంబీసీ 26 వద్ద గల క్యూలోకి అనుమతిస్తారు. వీరికి శనివారం ఉదయం 7 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. ఈ క్యూలో 22 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.
ఈ-దర్శన్‌లో రూ.300 దర్శనం కోసం ఇప్పటికే 5వేలు వరకు టికెట్ల ఇచ్చారు. వీరిని మాత్రమే శుక్రవారం ఉదయం నుం చి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో రూ.300 టికెట్ల దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. 12వ తేదీ ద్వాదశి రోజున ఐదువేల వరకు రూ.300 టికెట్లు తిరుమలలో కేటాయించనున్నారు.
రూ.50 సుదర్శనం, వృద్ధులు, వికలాం గులు, చంటిబిడ్డల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు. అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు.
గదుల కోసం సిఫారసులను స్వీకరించడం లేదు. ప్రముఖులైనా తిరుమలలోని సం బంధిత కార్యాలయాలకు వ్యక్తిగతంగా వస్తేనే కేటాయిస్తున్నారు. వీరి సిఫారసులను స్వీకరించడం లేదు. కేంద్రీయ విచారణా కార్యాలయంలో మాత్రమే సామాన్య భక్తులను గదులు కేటాయించనున్నారు.
వైకుంఠ ఏకాదశి రోజు నుంచి కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఒక్కో ఉచిత లడ్డూ అందజేయనున్నారు. తిరుపతిలోని శ్రీని వాసం, మాధవం టీటీడీ వసతి సముదాయాల్లో రెండు పూటలా భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల్లోపు స్వర్ణ రథోత్సవం, ద్వాదశి రోజు తిరుమల పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి సందర్భంగా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా చక్రస్నానం నిర్వహించనున్నారు.
స్వామిసేవకు అంతా రెడీ
Published Fri, Jan 10 2014 2:28 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM
Advertisement
Advertisement