
సాక్షి, తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ద్వారంలో నడవటం స్వర్గంలో నడిచిన అనుభూతి కలిగిందని అన్నారు. రాబోయే 2021లో అందరి కష్టాలు తీరి శుభం కలగాలని కోరుకున్నాని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, సీఎం వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండి 30 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా దీవెనలు ఇవ్వాలని ప్రార్ధించామని రోజా చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపైన ఆమె విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు చిన్న మెదడు చిట్లినట్టు ఉందని, అందుకే అర్థం లేని వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. భక్తులపై లాఠీ చార్జీ టీటీడీ ఎన్నడూ చేయలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, కోవిడ్ నిబంధనలు పాటిస్లూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తోందని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment