
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుటుంబ సభ్యులతో కలసి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.