lord balaji
-
ఆనంద నిలయం అంటే... ఆ దేవదేవుడి నిలయం
-
పుణేలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
పుణే సిటీ : పుణే ఘోర్పడి ప్రాంతంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీవారి కల్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమ్రోగి పోయింది. కల్యాణోత్సవంలో శ్రీవారికి పట్టువస్త్రాలను అందించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఉత్సవం నిర్వహించారు. శ్రీవారికి శ్రీదేవి, భూదేవిల అప్పగింతల కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. ఈ వేడుకలు చూసేందుకు పట్టణంలోని తెలుగువారితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు శ్రీవారి ప్రసాదం లడ్డూను భక్తులకు అందజేశారు. కాగా, దాదాపు 30 వేల మందికి మహాప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమాలలో ఆదివారం పుణే పార్లమెంట్ సభ్యులు అనిల్ శిరోలె పాల్గొనగా, సోమవారం స్థానిక కార్పొరేటర్లు మంగళా మంత్రి ఉమేష్ గైక్వాడ్, మాజీ డిప్యూటీ మేయర్ ప్రకాశ్ మంత్రి పాల్గొన్నారు. కాగా, సప్తగిరి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ అధ్యక్షులు దొంగరి సుబ్బారాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్ల మాధవ రావు, రాజేంద్ర రావు, కల్లూరి భాస్కర్రెడ్డి, కె.బలరాం, కామనబోయిన చెంచయ్య, ఉపాధ్యక్షులు దుగ్గిరెడ్డి మాధవరెడ్డి, వి.ఎస్.చలసాని, పాలగిరి చంద్రశేఖర్రెడ్డి, మాజీ అధ్యక్షులు సావ నారాయణ, శ్రీనివాస్ భండారి, బొర్రాజు తిరుపతయ్య, పాలగిరి భాస్కర్రెడ్డి, సురేశ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వెంకన్నకు విదేశీ బైక్ కానుక
తిరుమల: అమెరికాలో తయారైన కమాండో మోటార్ సైకిల్ తిరుమలేశునికి ఆదివారం కానుకగా అందింది. రూ.2 లక్షల విలువైన ఈ ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్లోని ఫోన్సిక్స్ సంస్థలకు చెందిన చుక్కలపల్లి సురేష్ విరాళంగా సమర్పించారు. ఈ వాహనాన్ని తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుకు అందజేశారు. దాత విజ్ఞప్తి మేరకు జేఈవో కొంత దూరం బైక్ నడపడం విశేషం. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ముంబయి, గోహతి, ఒడిస్సా హైకోర్టు న్యాయమూర్తులు వీకే తహిల్ రామిని, గౌహతి, సుమత్శ్యామ్, ఎస్కే మిశ్రాలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఇండియన్ బ్యాంకు ఎండీ ఎంకే జైన్, బ్యాంకు తిరుమల బ్రాంచి మేనేజర్ సురేంద్రబాబు, నటుడు చంటి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుటుంబ సభ్యులతో కలసి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట లోపే సమయం పడుతోంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోవడానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలి నడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. -
11న శ్రీవారికి దీపావళి ఆస్థానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 11వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సర్వభూపాల వాహనంపై, మరో వాహనంపై విష్వక్సేనుడిని వేంచేపు చేస్తారు. ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు చేస్తారు. -
స్వర్ణరధం పై ఊరేగుతున్న శ్రీవారు
-
తిరుమలలో బ్రహ్మోత్సవాలు: ఆర్జిత సేవల రద్దు
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో సాంబశివరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశామని, వీఐపీ దర్శనాలు కూడా తగ్గించామన్నారు. వాహన సేవ చూసేందుకు వచ్చే భక్తుల కోసం నాలుగు మాఢ వీధుల్లో గ్యాలరీలను ఏర్పాటు చేశామని చెప్పారు. గరుడ సేవ నాడు భక్తుల కోసం తిరుమలలో 512 ఆర్టీసీ బస్సులతో 3, 500 ట్రిప్పులు తిప్పుతామన్నారు. తిరుమలలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు త్వరితగతిన శ్రీవారిని దర్శించుకునేలా పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తిరుమలలో23, తిరుపతిలో 4 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు మొదటిరోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని సాంబశివరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో విద్యుత్ సమస్యరాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. బ్రహ్మోత్సవాల భద్రతకు ఎండీఆర్ఎఫ్ను రప్పించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు. 6వేల మందితో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. తిరుమల, తిరుపతిలో భక్తుల సౌకర్యార్థాం పోలీస్ కంట్రోల్ రూం, హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. -
వెంకన్న రికార్దు
-
స్వర్ణ రధం పై ఊరేగుతున్న శ్రీవారు
-
ప్రారంభమైన శ్రీనివాసుడి అశ్వయుజ మాస బ్రహ్మొత్సవాలు
-
సమ్మోహన మోహిని రూపంలో శ్రీ వేంకటేశ్వరుడు