తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 11వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన నిర్వహిస్తారు.
అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సర్వభూపాల వాహనంపై, మరో వాహనంపై విష్వక్సేనుడిని వేంచేపు చేస్తారు. ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు చేస్తారు.