దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను శుక్రవారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ మురళీమోహన్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు దంపతులు, సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయనిర్మల దంపతులు, పోలవరం ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే బి.ప్రభాకరచౌదరి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే యు.హనుమంతరాయ చౌదరి, గుంతకల్లు ఎమ్మెల్యే జీ.జితేంద్రగౌడ్ కూడా అమ్మను దర్శించుకున్నారు.