వీఐపీలూ... మీరు రావద్దు..
భద్రాచలం : రాజమండ్రి ఘటన నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే శని,ఆదివారాల్లో ఖమ్మం జిల్లా భద్రాచలానికి వీఐపీలు రావద్దని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. ఈ రెండు రోజుల్లో మంత్రులు, వీఐపీలు పుష్కరస్నానానికి రాకుండా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీఐపీలు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, సుమారు ఐదు లక్షల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారు రాకుండా చూడాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.
శని, ఆదివారాల్లో భద్రాద్రికి భక్తజనం పోటెత్తనున్నారని, సుమారు 10 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. భద్రతా ఏర్పాట్ల నిర్వహణలో మంత్రి తుమ్మల, కలెక్టర్, ఎస్పీ నిగమగ్నమై ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను అధికారులు రప్పిస్తున్నారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేక దర్శనాల నేపథ్యంలో కూడా వీఐపీలు ఆ రెండు రోజులు రావద్దు.. అని అధికారులు సూచిస్తున్నారు.