భద్రాచలం (ఖమ్మం జిల్లా) : ఆరవ రోజు గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఖమ్మం జిల్లా భద్రాచలం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజామున గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించారు. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతోంది.
మరో వైపు భద్రాచలం వచ్చే వాహనాల సంఖ్య భారీగా ఉండటంతో భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందు జాగ్రత్తలు సూచించారు. అంతేకాకుండా ఖమ్మం నుంచి భద్రాచలం వరకు మూడు ప్రత్యేకమైన చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు.
భద్రాచలంలో భక్తుల రద్దీ
Published Sun, Jul 19 2015 8:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM
Advertisement