
భద్రాచలంలో భక్తుల కిటకిట
భద్రాచలం(ఖమ్మం జిల్లా): గోదావరి పుష్కరాల సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలం క్షేత్రం భక్తుల రద్దీతో పొటెత్తింది. శుక్రవారం రాత్రికే భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలం చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పుష్కరతీరం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి 7 గంటలకు పైగా సమయం పడుతుందని సమాచారం.