గన్నవరం ఎయిర్పోర్టుకు వీఐపీల తాకిడి | VIPs rush at gannavaram airport | Sakshi
Sakshi News home page

గన్నవరం ఎయిర్పోర్టుకు వీఐపీల తాకిడి

Published Thu, Oct 22 2015 10:08 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

గన్నవరం ఎయిర్పోర్టుకు వీఐపీల తాకిడి - Sakshi

గన్నవరం ఎయిర్పోర్టుకు వీఐపీల తాకిడి

గన్నవరం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అతిథులు తరలి వస్తున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయానికి వీఐపీల తాకిడితో కిటకిటలాడుతోంది ఇప్పటికే పలువురు అతిథులు అమరావతి చేరుకోగా, మరికొందరు తరలి వస్తున్నారు.  

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, నటుడు సుమన్, జపాన్ ప్రతినిథులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోస్లే, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, పలువురు ప్రముఖులు గన్నవరం చేరుకుని అక్కడ నుంచి ఉద్దండరాయపాలెం బయల్దేరారు. ఇక ఇప్పటికే ఏపీ మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు అక్కడకు చేరుకున్నారు.

మరోవైపు అమరావతి శంకుస్థాపన పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం ఎస్పీజీ ఆధీనంలో ఉండగా, మరో 14వేల మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 25 సీసీ కెమెరాలు, టీవీల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement