
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఏపీ డీజీపీ సాంబశివరావు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనమనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.