విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా పుష్కరాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఘాట్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్ను పిలిచి ఆయన ఇవాళ మందలించారు. కాంట్రాక్టర్లపై ఆధారపడకుండా పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
కాగా ముఖ్యమంత్రి నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణానది పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై సంజాయిషీ చెప్పాలని హుకుం జారీ చేశారు. ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
కృష్ణా పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష
Published Fri, Jul 22 2016 2:25 PM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM
Advertisement
Advertisement