కృష్ణా ఘాట్‌లో పుష్కర స్నానం చేస్తున్న భక్తులు
-
భక్తులతో కిటికిటలాడిన దత్తక్షేత్రం
-
వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు
పస్పుల ఘాట్ నుంచి సాక్షి : పవిత్ర కృష్ణా పుష్కరాలకు నదీతీరం భక్తులతో పోటెత్తింది. పుణ్యస్నానాల కోసం 8వరోజు శుక్రవారం పస్పుల ఘాట్‌లో దాదాపు 60వేల మంది భక్తులు స్నానమాచరించారు. భక్తుల రద్దీ పెరగడంతో ట్రెయినీ కలెక్టర్ పలేమా సత్పతి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దత్తక్షేత్రంతో పాటు పంచదేవ్‌పాడ్ శ్రీపాద వల్లభస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా దేవాదాయశాఖ తరుపున సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీ పెరగడంతో అదనంగా మరో షవర్ ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా నది నీటిని పరీక్షలు నిర్వహించారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదనంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు పిండప్రదానం, చాటవాయనం తదితర మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీపాదచాయ ఆశ్రమంలో అన్నదానం చేశారు. పార్కింగ్‌లో వాహనాలు నిండుకున్నాయి.