
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రారంభమయ్యే ఈ జాతర మూడు నెలల పాటు కొనసాగుతుంది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామికి నైవేద్యం సమర్పించారు. గుట్టపై వెలసిన రేణుక ఎల్లమ్మకు సైతం నైవేద్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భక్తులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment