Komuravelli Mallikarjuna Swamy
-
Komuravelli Mallanna: జాతర నాటికి పనులు పూర్తయ్యేనా!
సాక్షి, సిద్దిపేట: ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. కోరమీసాల మల్లన్నగా ప్రసిద్ధి. ప్రతి ఏడాది మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. ఈ దేవాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పట్నం, బోనం, స్వామి వారికి మొక్కులు చెల్లిస్తుంటారు. మరో మూడు నెలల్లో జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జాతర సమయంలో రోజుకు 30 వేలకు పైగా, సాధారణ సమయంలో ఆదివారం, బుధవారాల్లో 20 వేలకు పైగా భక్తులు వస్తుంటారు.ఆరేళ్లుగా కొనసాగుతున్న గదుల నిర్మాణంకొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయ పరిసరాల్లో దాతల సహకారంతో 128 గదులు కొన్నేళ్ల కిందట నిర్మించారు. అందులో 18 గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక మిగిలినవి 110 గదులు మాత్రమే. అందులో నుంచే జాతర సమయంలో పోలీసులకు, ఇతర అవసరాలకు దాదాపు 50 వరకు వినియోగిస్తారు. ఇక 60 గదులే భక్తులకు అందుబాటులో ఉంటాయి. జాతర మూడు నెలల పాటు జరుగుతుంది. బుధ, ఆదివారాల్లో రోజుకు 50 వేలకు పైగా మిగతా రోజుల్లో 30 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. జాతర సమయంలో ప్రైవేట్ అద్దె గదుల యజమానులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో గదికి 12 గంటలకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించలేని భక్తులు చెట్ల కిందనే బోనం వండి దేవాలయంలో బోనం, పట్నం చెల్లిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో 2018 సంవత్సరంలో 50 గదుల నిర్మాణంను ప్రారంభించారు. రూ.10.65 కోట్ల వ్యయంతో జీ ప్లస్ టుతో నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి పనులు ఆగుతూ సాగుతూ వస్తున్నాయి. ఆరేళ్లు పూర్తవుతున్నా ఇంకా గదుల నిర్మాణం పూర్తి కాలేదు. ఈ గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఈ జాతరకు అందుబాటులోకి వచ్చేలా చేసి, ఇంకా 150కి పైగా గదుల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.క్యూ కాంప్లెక్స్ పూర్తయ్యేనా?మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. కర్రలతో క్యూలైన్లను ప్రతి జాతర సమయంలో ఏర్పాటు చేస్తారు. దర్శనానికి బుధ, ఆదివారాల్లో 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి క్యూలైన్లో ప్రవేశిస్తే మళ్లీ బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, చిన్నారులు మూత్రంకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల వినతుల మేరకు క్యూ కాంప్లెక్స్‌లను నిర్మించాలని నిర్ణయించారు. రూ.12 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులను 2023, అక్టోబర్‌లో ప్రారంభించారు. ఇప్పటి వరకు స్లాబ్‌లు వేశారు. లోపల క్యూలైన్లు, మూత్రశాలలు నిర్మించాలి.జాతర నాటికి పనులు పూర్తయ్యేనా?మరో మూడున్నర నెలల్లో స్వామి వారి కల్యాణంతో జాతర ప్రారంభం కానుంది. ఉగాది వరకు జాతర జరగనుంది. జాతర సమయంలో రోజుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెరిగితేనే జాతర నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే భక్తుల ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.పూర్తయ్యేందుకు కృషి చేస్తాంక్యూ కాంప్లెక్స్‌కు మూడు స్లాబ్‌లు వేశాం. 50 గదుల నిర్మాణం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు. ఈ జాతర నాటికి పనులు పూర్తయ్యేందుకు కృషి చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.– బాలాజీ, ఈఓ -
మల్లన్నా.. ఎందుకిలా?
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఆధ్వర్యంలో దాసారం గుట్టపై హిల్ వ్యూ గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు ఇంకా కొలిక్కి రావడంలేదు. రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్న తీరు అనుకొన్నదొక్కటి.. ఐయ్యిందొక్కటిలా మారింది. ప్రణాళికా లోపం కారణంగా చిన్న పనిగా మొదలైన రోడ్డు నిర్మాణం ఇప్పుడు బాహుబలి ప్రాజెక్టుగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. సాక్షి, సిద్దిపేట: భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం దాసారం గుట్ట పైన గెస్ట్‌హౌస్‌లను నిర్మించాలని నిర్ణయించింది. గుట్టమీద చదును చేస్తే రెండు ఎకరాల స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. హిల్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లుగా కొమురవెల్లికి సరికొత్త సొబగులు అద్దుతామంటూ గొప్పలు చెప్పారు. అనుకున్నదే తడవుగా అనుమతులు జారీ చేశారు. నిధులు మంజూరు చేశారు. తీరా పనులు మొదలెట్టాక, పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. పనులు మొదలై ఐదేళ్లు దాటింది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చారాణా పనికి.. గెస్ట్‌హౌస్‌లను నిర్మించేందుకు ఎంపిక చేసిన దాసారం గుట్టపైకి రాకపోకలు సాగించేందుకు సుమారు 30 ఫీట్ల వెడల్పుతో 550 మీటర్ల రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు గుర్తించారు. రెండు మూల మలుపులు ఉండే విధంగా డిజైన్ ఖరారు చేశారు. 2017లో ప్రారంభించారు. ఆరంభంలో ఈ రోడ్డు నిర్మాణం అంచనా వ్యయం కేవలం రూ.1.40 కోట్లు. కానీ ఆ నిధులతో పదిశా తం కూడా పనులు పూర్తి కాలేదు. దీంతో 2021లో అంచనాలు సవరించి రూ.3.5 కోట్లు కేటాయించా రు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటి వరకు 4.9కోట్లు వెచ్చించినా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో రోడ్డు అందుబాటులోకి రావాలంటే మరో రూ.1.9 కోట్లు అవసరం అంచనాలు వేశారు. ఆ నిధులు ఇంకా మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. లక్ష్యం నెరవేరేనా? ప్రస్తుత అంచనాల ప్రకారం గుట్టపైకి రోడ్డు కోసమే రూ.9కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే రూ.9కోట్లు వెచ్చిస్తే కొమురవెల్లి దేవాలయానికి సమీపంలో తొమ్మిది ఎకరాలకు పైగా స్థలం లభించేదని స్థానికులు అంటున్నారు. పైగా గుట్టపై నిర్మించే గెస్ట్‌హౌస్‌లు సైతం వీవీఐపీల వరకే పరిమితం కానున్నాయి. కొమురవెల్లి దేవాలయానికి వాహనాల్లో వచ్చిన వారే గుట్ట పైకి ఎక్కే అవకాశం ఉంటుంది. సాధారణంగా బస్సుల ద్వారా వచ్చే భక్తులు గుట్ట మీద ఆశ్రయం పొందలేరు. అంచనా వ్యయాని కి మూడున్నర రెట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితం దక్కుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కమీషన్ల కోసమేనా? గుట్టపైన అందుబాటులోకి వచ్చే స్థలం కేవలం రెండు ఎకరాలు. కామన్ యూజ్ ఏరియా, పార్క్ తదితర ఏర్పాట్లకు స్థలాన్ని కేటాయిస్తే కాటేజీల నిర్మాణానికి దక్కే స్థలం కష్టంగా ఎకరాన్ని మించి ఉండదు. హిల్‌వ్యూ గెస్ట్‌హౌస్ కావడంతో విశాలంగా నిర్మాణం చేయకపోతే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. కేవలం ఎకరం స్థలం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం నిర్మాణ పనుల్లో కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారనే విమర్శలు సైతం వినవస్తున్నాయి. నిధులు రాగానే పనులు గుట్టమీద దారి కోసం మొదట రూ.1.4కోట్ల నిధులు కేటాయించారు. గుట్టమీదికి మట్టితో రోడ్ ఫాం చేస్తే ఉండదు. కనుక వాల్స్‌ను నిర్మించి రోడ్ ఫాం చేస్తున్నాం. అందుకే వ్యయం పెరిగింది. మళ్లీ నిధులు కేటాయించగానే పనులు ప్రారంభిస్తాం. – శ్రీనివాస్ రెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
మల్లన్నా.. ఏదీ రక్షణ?
కొయురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సీసీ కెమరాలకు సంబంధించిన సిస్టం(ఎన్వీఆర్) ధ్వంసమైంది. దీంతో దేవాలయంలోని 32 కెమెరాలు పని చేయడం లేదు. గుడి పరిసరాలలో పనిచేసే సీసీ కెమెరాల సిస్టం యూనిట్‌ను ఏఈవో గదిలో అమర్చారు. ప్రస్తుతం దీనిని పగులకొట్టడంతో సీసీ కెమెరాలు పని చేయక నిత్యం స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు రక్షణ కరువైంది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుందని టెక్నీషియన్ చెబుతున్నాడు. దీంతో ఆలయంలో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారం క్రితం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గొడవ గురించి సీసీ ఫుటేజీ తీసుకుందామని మంగళవారం టెక్నీషియన్‌ను పిలిపించగా ఎన్వీఆర్ ధ్వంసమైన విషయం తెలిసింది. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించి ఉద్యోగులే సీసీ కెమెరాల సిస్టం యూనిట్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. కొద్దిరోజులుగా ఈయనకు, ఏఈఓ అంజయ్య మధ్య విభేదాలు తలెత్తడంతో ఆలయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. -
పసుపుమయం పట్నం వారం
కొమురవెల్లి (సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని తోటబావి ప్రాంగణంలో పట్నం వారాన్ని పురస్కరించుకొని సోమవారం అగ్నిగుండాలు, పెద్దపట్నం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒగ్గు పూజారులు పంచవర్ణాల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలతో (మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలతో నిప్పు కణిక లు తయారు చేసి అగ్ని గుండాలను సిద్ధం చేశారు. తర్వాత ఉత్సవ విగ్రహాలతో ఆలయ పూజారులు పెద్దపట్నం, అగ్ని గుండాలు దాటారు. -
కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)
-
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్నను భక్తులు దర్శించుకొని తరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తులు స్వామి వారిని దర్శించుకొని మేడారం వెళ్తుండడంతో రద్దీ పెరిగింది. మల్లన్న దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఒక్కపొద్దులతో పాటు మట్టికుండలో పసుపు బియ్యంతో నైవేద్యం సమర్పించి గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు మల్లన్న గుట్టపైన కొలువైన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. -
కన్నుల పండుగగా సిద్ధిపేట కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి కళ్యాణం
-
కొమురవెల్లి మల్లన్నకు ‘వెండి ద్వారాలు’
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వెండి కాంతులతో ధగధగలాడుతోంది. భక్తులు హుండీలో వేసిన వెండి కోరమీసాలు, తొట్టెలు, బాసింగాలను కరిగించి ఆలయంలోని మూడు ద్వారాలు, తలుపులకు వెండిరేకులతో తాపడం చేయించారు. మూడు నెలలు శ్రమించి.. భక్తులు మల్లికార్జునుడికి వెండి కోరమీసాలు సమర్పిస్తుంటారు. పెళ్లి అయిన తర్వాత వెండి బాసింగాలు చెల్లించడం, పిల్లలు పుడితే వెండి తొట్టెలను అందిస్తానని మొక్కుకోవడం ఆనవాయితీ. ఇలా కోర్కెలు తీరిన తర్వాత భక్తులు హుండీలో వేసిన వెండి 786.655 కిలోలకు చేరింది. ఈ కానుకలను కరిగించగా 615.454 కిలోల వెండి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయ ద్వారాలు, తలుపులకు వెండి తాపడం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ద్వారా ఈ పనులను తిరుపతికి చెందిన బాలాజీ మెటల్ వర్క్స్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ మూడు నెలల పాటు శ్రమించి 493 కిలోల వెండితో మూడు ద్వారాలు, తలుపులకు తాపడం చేసింది. -
కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రారంభమయ్యే ఈ జాతర మూడు నెలల పాటు కొనసాగుతుంది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామికి నైవేద్యం సమర్పించారు. గుట్టపై వెలసిన రేణుక ఎల్లమ్మకు సైతం నైవేద్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భక్తులు తరలివచ్చారు. -
ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు: తలసాని
కొమురవెల్లి (సిద్దిపేట): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాలం దగ్గర పడిందని, రాబోయే ఎన్నికల్లో అక్కడి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం వీఐపీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ చంద్రబాబు అని అన్నారు. ఆయన స్వార్థ రాజ కీయ ప్రయోజనాల కోసం ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని సంసారం చేసి విడాకులు తీసుకుని ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని దేశం మొత్తం చూస్తుంటే చంద్రబాబుకు కానరావడం లేదని, ఆయన వంకర బుద్ధికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న పెళ్లికి చంద్రన్న
స్వామి వారికి పట్టు వ్రస్త్రాలు సమర్పించనున్న సీఎం కేసీఆర్ రెండున్నర గంటల పర్యటన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణానికి ఆదివారం సీఎం కే.చంద్రశేఖరరావు వస్తున్నారు.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.. ఈ సందర్భంగా ఏర్పాట్లను సీఎం ఇంటెలిజెన్స సెక్యూరిటీ ఐజీ ఎం.ఎం. మహేశ్ భగవత్, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, కలెక్టర్ కిషన్ పర్యవేక్షించారు.. - చేర్యాల/హన్మకొండ అర్బన్ శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు.. అయ్యూ.. మేము శ్రీ మల్లికార్జున స్వామి భక్తులం. ఏటా జాతర బ్రహ్మోత్సవాల్లో కొమురెల్లి మల్లన్నను దర్శించుకునేటోళ్లం. మది నిండా మల్లన్నను నింపుకొని కొమురెల్లికి వస్తే.. ఇక్కడ సమస్యలే స్వాగతం పలుకుతున్నారుు. ప్రతీ ఏడాది వచ్చే మాకు ఎప్పుడూ గీ అవస్థలే ఎదురవుతున్నారుు. నేడు(ఆదివారం) జరిగే మల్లన్న పెండ్లికి మీరు కూడా వస్తున్నరని తెలిసింది. మీతో చెప్పుకుంటే మా కష్టాలు తీరుతాయనే నమ్మకంతోనే గీ లేఖ రాస్తున్నం. మాకు తోచిన పరిష్కారాలు కూడా పేర్కొన్నం. జెర పరిశీలించుండ్రి. వచ్చే ఏటికన్నా.. అన్ని వసతులు కల్పించుండ్రి. సమస్య : దర్శనానికి వచ్చినోళ్లం గుడారాలు వేసుకుని ఉంటున్నం. పరిష్కార మార్గాలు : అర్ధంతరంగా నిలిచిపోరుున చౌల్ట్రీ(వసతి గృహ సముదాయం) నిర్మాణాన్ని పూర్తిచేయూలి. స్వామి దర్శనం కోసం క్యూ లైన్ ఇక్కట్లు సుమారు 5 గంటలు నిల్చుంటేనే దర్శనం లభిస్తుంది. క్యూ లైన్లలో భక్తులకు కూర్చునే వె సులుబాటు, తాగునీరు, ఫ్యాన్లు, తదితర వసతులు కల్పించాలి. రాజగోపురం పక్కన ఖాళీస్థలంలో మూత్రశాలలు నిర్మించాలి. వృద్ధులు, వికలాంగులు, భారీకాయులు దర్శనానికి అవస్థలు పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో లిఫ్ట్ ఏర్పాటు చేయూలి. భక్తుల వస్తు సామగ్రికి రక్షణ ఉండడం లేదు రాజగోపురం వద్దచెప్పుల స్టాండ్, లగేజీ స్టాండ్లు ఏర్పాటు చేయూలి. డబ్బుల అత్యవసరమైతే సిద్ధిపేట, దుద్దెడకు వెళ్లాల్సి వస్తోంది. కొమురవెల్లిలో ఏటీఎంలు ఏర్పాటు చేయూలి. ఆలయ ప్రాంగణంపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఆలయ ఆవరణ, పరిసర వీధుల్లో సీసీ రోడ్లు వేసి డ్రెరుునేజీలు కట్టించాలి. జాతరలో లక్షకుపైగా భక్తులకు తాగునీటి వసతి సరిగా లేదు. స్థానిక నీటి ట్యాంకులకు తోడు కోడెల స్తంభం, బస్టాండ్, దాసారం గుట్ట, సినిమాటాకీసు, రాంసాగర్ రోడ్డు, పెద్దమ్మ ఆలయం వద్ద మరిన్ని నీటి ట్యాంకులు ఏర్పాటు చేయూలి. మల్లన్న చెరువులోకి మురికి నీరు చేరి మా మనోభావాలు దెబ్బతింటున్నారుు. ఇందులో స్నానం చేయలేపోతున్నారు. ఈ మురికినీటిని మత్తడి నుంచి బయటకు పంపించేలా ప్లానింగ్ చేయించి నిధులు విడుదల చే రుుంచాలి. మల్లన్నకు మొక్కులు చెల్లించాక మల్లన్న గుట్టపైన రేణుక ఎల్లమ్మకు బోనాలు అప్పగిస్తాం. కానీ అక్కడికెళ్లడానికి తిప్పలు పడుతున్నం. మల్లన్న గుట్టపైకి మెట్లకు మరమ్మతులు చేరుుంచాలి. గుట్టపై రేకుల షెడ్డు, కుర్చీలు వేయూలి. తాగునీటి వసతి కల్పించాలి. ఆలయూనికి భక్తుల రాక పెరిగినా అభివృద్ధి జరగడం లేదు. మల్లన్న జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఏటా నిధులు కేటారుుస్తే ఐదేళ్లలో దశ మారనుంది. సీఎంగారూ.. ఇంకో ముచ్చట మల్లన్న గుట్ట ప్రకృతి సోయగాల నడుమ వెలసింది. ఇక్కడి అందాలను భక్తులు పూర్తిస్థారుులో ఆస్వాదించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదానికి మల్లన్న ఆలయూన్ని నెలవుగా మార్చినట్లవుతుంది. ఆలయ పరిసర ప్రాంతంలో పార్కులు ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకునేందుకు, ఇతర సామగ్రి సమకూర్చితే ఉపయోగకరమవుతుంది. మల్లన్న చెరువులో బోటింగ్‌ను ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. గుట్టపైకి వెళ్లడానికి రూప్వేను ఏర్పాటు చేయాలి. గతంలోనూ పాలకులు మల్లన్న జాతరకు వచ్చి అనేక హామీలు ఇచ్చి విస్మరించారు. పొన్నాల లక్ష్మయ్య దేవాదాయ ధర్మదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ నిధులు పెద్దగా దక్కలేదు. తొలిసారి స్వరాష్ట్రంలో జరుగుతున్న మల్లన్న కల్యాణ వేదిక వద్ద.. ఆలయ దశ మార్చే ప్రకటనను మేమంతా ఆశిస్తున్నాం. ఆ తదిపరి కార్యాచరణనూ కోరుకుంటున్నాం. ఇట్లు కొమురెల్లి మల్లన్న భక్తులు సీఎం షెడ్యూల్ ఉదయం(గంటలు) 10.45 : బేగంపేట నుంచి బయల్దేరుతారు. 11.00 : చేర్యాలకు చేరుకుంటారు. 11.30 : కొమురవెల్లికి చేరుకుంటారు. 11.50 : కల్యాణంలో పాల్గొంటారు. మధ్యాహ్నం.. 12.30 : కురుమ సంఘ భవనం ప్రారంభోత్సవం. 1.00 : భోజనం 1.30 : తిరుగు పయనం