
కొమురవెల్లి (సిద్దిపేట): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాలం దగ్గర పడిందని, రాబోయే ఎన్నికల్లో అక్కడి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం వీఐపీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ చంద్రబాబు అని అన్నారు. ఆయన స్వార్థ రాజ కీయ ప్రయోజనాల కోసం ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని సంసారం చేసి విడాకులు తీసుకుని ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని దేశం మొత్తం చూస్తుంటే చంద్రబాబుకు కానరావడం లేదని, ఆయన వంకర బుద్ధికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment