
పసుపుతో నిండిన శివసత్తులు, భక్తులు
కొమురవెల్లి (సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని తోటబావి ప్రాంగణంలో పట్నం వారాన్ని పురస్కరించుకొని సోమవారం అగ్నిగుండాలు, పెద్దపట్నం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఒగ్గు పూజారులు పంచవర్ణాల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలతో (మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలతో నిప్పు కణిక లు తయారు చేసి అగ్ని గుండాలను సిద్ధం చేశారు. తర్వాత ఉత్సవ విగ్రహాలతో ఆలయ పూజారులు పెద్దపట్నం, అగ్ని గుండాలు దాటారు.
Comments
Please login to add a commentAdd a comment