సా..గుతున్న ఎగువ ఘాట్ పనులు
సా..గుతున్న ఎగువ ఘాట్ పనులు
Published Sun, Aug 7 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
సంగమేశ్వరం(కొత్తపల్లి): సప్తనదుల సంగమేశ్వరంలో ఎగువ ఘాట్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఎగువప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో సోమవారం సాయంత్రం నాటికి సంగేశ్వరాలయం పూర్తిగా నీటిలో మునిగిపోనుంది. దిగువనున్న పుష్కరఘాట్లు పూర్తిగా మునిగిపోవటంతో భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకుగాను ఎగువఘాట్ల నిర్మాణం పనులు చేస్తున్నారు. కేవలం నాలుగురోజులు మాత్రమే ఉండటంతో ఎగువఘాట్ల నిర్మాణం పనులు పూర్తవుతాయా అనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement