పుష్కర ఘాట్లు.. ఎంతెంత దూరం? | pushkara ghats in kurnool | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్లు.. ఎంతెంత దూరం?

Published Thu, Aug 4 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

pushkara ghats in kurnool

– కర్నూలు నుంచి శ్రీశైలానికి 195 కిలో మీటర్లు
– సంగమేశ్వరం 104, బీచుపల్లి 51 కిలో మీటర్లు
 
కర్నూలు(రాజ్‌విహార్‌):
కృష్ణా పుష్కరాలు మరో ఎమిమిది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే వేడుకల సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేసి పునీతులు కావాలని అందరూ కోరుకుంటారు. మహారాష్ట్రలోని మహాబళేశ్వరంలో పుట్టిన కృష్ణానది కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఈ నది 1400కిమీ దూరం ప్రవహించి.. కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ వద్ద హంసలదీవిలో బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈనెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నదీ స్నానమాచరించేందుకు వెళ్లే భక్తులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వారి కోసం పుష్కర ఘాట్ల దూరంపై ప్రత్యేక కథనం..
  – జిల్లా కేంద్రం కర్నూలు నుంచి శ్రీశైలానికి 195కిలో మీటర్ల దూరం ఉంది. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి తప్పనిసరిగా ఆర్టీసీ బస్‌ సౌకర్యం ఉంటుంది. ఆదోని నుంచి కర్నూలుకు 97కిలో మీటర్ల దూరం ఉండగా ఎమ్మిగనూరు–67, మంత్రాలయం–91, ఆలూరు–108, పత్తికొండ–82, కోడుమూరు–35, డోన్‌–53, నంద్యాల–72, ఆళ్లగడ్డ–117, పాణ్యం–52, నందికొట్కూరు–32, బనగానపల్లె–76, కోవెలకుంట్ల –92, ఆత్మకూరు (శ్రీశైలం) 72 కిలో మీటర్లు ఉంది. 
– ఆత్మకూరు, నందికొట్కూరు రూటులో ఉన్న పట్టణాలు, గ్రామాలకు చెందిన భక్తులు కర్నూలుకు రావాల్సిన అవసరం లేదు.  బనగానపల్లెతోపాటు కోవెలకుంట్ల పరిసర ప్రాంత ప్రయాణికులు నంద్యాలకు చేరుకొని అక్కడి నుంచి ఆత్మకూరు మీదుగా సంగమేశ్వరం, శ్రీశైలానికి చేరుకోవచ్చు.
– లింగాలగట్టు ఘాట్లలో స్నానం చేయాలనుకున్న భక్తులు శ్రీశైలం కంటే ముందే వచ్చే సున్నిపెంట నుంచి శ్రీశైలం డ్యాం (ప్రాజెక్టు) మీదుగా లింగాలగట్టు (14కిలోమీటర్లు) చేరుకోవచ్చు. సున్నిపెంట నుంచి శ్రీశైలం 10కిలో మీటర్ల దూరం ఉంది.
– కర్నూలు నుంచి 32కిలో మీటర్ల దూరంలో ఉన్న నందికొట్కూరు చేరుకుంటే అక్కడి నుంచి నెహ్రూనగర్‌ 15కిలో మీటర్ల దూరం ఉంది. అక్కడ కష్ణానది బ్యాక్‌ వాటర్‌ (వేరే తీరం)లో స్నానం చేయవచ్చు కానీ అక్కడ ప్రభుత్వ పరంగా అధికారిక పుష్కర ఘాట్‌ లేదు.
– కర్నూలుకు చేరుకున్న భక్తుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ స్నానపు ఘాట్లకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బస్సుల్లో కాకుండా సొంత వాహనాలు లేదా ప్రైవేట్‌ట్యాక్సీ, ట్రావెల్స్‌ ద్వారా కూడా పుష్కర ఘాట్లకు చేరుకోవచ్చు.
– జిల్లా కేంద్రం నుంచి మహబూబ్‌ నగర్‌ జిల్లా  బీచుపల్లి వద్ద ఉన్న పుష్కర ఘాట్‌ 51కిలో మీటర్ల దూరంలో బెంగుళూరు – హైదరాబాదు జాతీయ రహదారి పక్కనే ఉంది.
– కర్నూలు నుంచి నందికొట్కూరు 32కిలో మీటర్ల దూరం ఉండగా అక్కడి నుంచి పాములపాడు 28కిలో మీటర్లు ఉంది. అక్కడి నుంచి సంగమేశ్వరం 44కిలో మీటర్లు ఉండగా ఆత్మకూరు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి దోర్నాల (ప్రకాశం జిల్లా) 63, అక్కడి నుంచి శ్రీశైలం 60కిలో మీటర్ల దూరం ఉంది. మల్లన్న క్షేత్రం చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ అధికారులు నడుపుతున్న ఉచిత బస్సుల్లో పాతాళగంగ వరకు వెళ్లవచ్చు.
– కర్నూలు నుంచి విజయవాడకు 342కిలో మీటర్ల దూరం ఉంది. ఆర్టీసీ పుష్కర దినాల్లో రోజుకు 10 చొప్పున బస్సులు నడుపుతోంది. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement