కరీంనగర్(రామగుండం): కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లకు నీటి ఉధృతి పెరిగింది. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పలు పుష్కర ఘాట్లలో ప్రవాహ వేగం పెరిగింది.మర్ముల్, మంథని, రామగుండం, గొలివాడ, గోదావరిఖని పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.