పుష్కర ఘాట్ల నిర్మాణ పనులపై మంత్రి అసంతృప్తి | narayana unsatisfied on pushkara ghats in | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్ల నిర్మాణ పనులపై మంత్రి అసంతృప్తి

Published Thu, Jul 21 2016 9:36 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

narayana unsatisfied on pushkara ghats in

గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం సమీపంలోని ప్రకాశం బ్యారేజి దిగువన నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులను పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ గురువారం పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడకూడదని అధికారులకు నారాయణ సూచించారు. దాదాపు రూ.6.50 కోట్ల వ్యయంతో ఈ పుష్కర ఘాట్లను నిర్మిస్తున్నారు. మంత్రి నారాయణ వెంట ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement