సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన తెలంగాణ రాష్ట్ర స్విమ్మర్లను ఆదివారం సత్కరించారు. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. విజయవాడలో డిసెంబర్ 27 నుంచి 29 వరకు జరిగిన సౌత్‌జోన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన 24 మంది స్విమ్మర్లు పతకాలను గెలుచుకున్నారు. వీరందరిని తెలంగాణ స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి ఎం. రామకృష్ణ, కోశాధికారి ఉమేశ్, ఉపాధ్యక్షులు ఎం. కృష్ణ, హైదరాబాద్ జిల్లా స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి జి. గిరిధర్ ప్రత్యేకంగా అభినందించారు.
పతకాలు సాధించిన స్విమ్మర్ల వివరాలు
గ్రూప్–1 బాలురు: యశ్ వర్మ (స్వర్ణం, రజతం, కాంస్యం), వై. హేమంత్ రెడ్డి (స్వర్ణం, రజతం), రుత్విక్ నాగిరెడ్డి (2 కాంస్యాలు), సీహెచ్ అభిలాష్ (2 కాంస్యాలు).
గ్రూప్–1 బాలికలు:1. శ్రీజ ముప్పనేని (2 స్వర్ణా లు, 1 రజతం), సి. కృష్ణ ప్రియ (2 కాంస్యాలు).
గ్రూప్–2 బాలురు: వై. జశ్వంత్ రెడ్డి (3 స్వర్ణాలు, రజతం, 2 కాంస్యాలు), సూర్యాన్షు (2 రజతాలు, 4 కాంస్యాలు), సాయి నిహార్ (2 రజతాలు, 2 కాంస్యాలు), ఆదిత్య (రజతం, కాంస్యం), చార్లెస్ (2 కాంస్యాలు), సాయి ప్రణీత్ (కాంస్యం).
గ్రూప్–2 బాలికలు: 1. సంజన (4 కాంస్యాలు), జి. హంసిని (4 కాంస్యాలు), అష్ఫఖ్ (2 కాంస్యాలు), ఇష్వి మథాయ్ (2 కాంస్యాలు)
గ్రూప్–3 బాలికలు: కాత్యాయని (రజతం, 3 కాంస్యాలు), సంస్కృతి (2 కాంస్యాలు), నందిని (2 కాంస్యాలు), చిన్మయి (2 కాంస్యాలు).
గ్రూప్–4 బాలురు: సుహాస్ ప్రీతమ్ (2 కాంస్యాలు), అభయ్ లక్కోజు (కాంస్యం), గౌతమ్ (కాంస్యం), డి. వర్షిత్ (కాంస్యం).
Comments
Please login to add a commentAdd a comment