సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ అక్వాటిక్స్ చాంపియన్ షిప్‌లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్విమ్మర్లు అద్భుత ప్రదర్శన చేశారు. నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలు సొంతం చేసుకున్నారు. గ్రూప్–4 బాలుర 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో ఎం. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్; 2ని:49.11 సెకన్లు)... గ్రూప్–1 బాలుర 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్; 1ని:06.91 సెకన్లు–కొత్త మీట్ రికార్డు)... గ్రూప్–1 బాలికల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ముప్పనేని శ్రీజ (తెలంగాణ; 1ని:28.65 సెకన్లు)... గ్రూప్–2 బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో వై. జశ్వంత్ రెడ్డి (తెలంగాణ; 1ని:04.72 సెకన్లు) స్వర్ణ పతకాలు గెలిచారు.
గ్రూప్–1 బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో యన్నం హేమంత్ రెడ్డి (తెలంగాణ; 1ని:04.67 సెకన్లు) రజతం నెగ్గగా... గ్రూప్–1 బాలుర 4్ఠ100 మీటర్ల మెడ్లే రిలేలో యువరాజు, వాసురామ్, లోహిత్, సుజన్ చౌదరీ (ఆంధ్రప్రదేశ్; 4ని:19.13 సెకన్లు) బృందం... గ్రూప్–2 బాలుర 4్ఠ100 మీటర్ల మెడ్లే రిలేలో జశ్వంత్ రెడ్డి, సూర్యాన్షు, సాయి నిహార్, ఆదిత్య రాయ్ (తెలంగాణ; 4ని:38.16 సెకన్లు) బృందాలకు రజతాలు లభిం చాయి. గ్రూప్–1 బాలుర 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో చల్లగాని అభిలాష్ (తెలంగాణ; 4ని:28.13 సెకన్లు)... గ్రూప్–1 బాలికల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చెన్నవోజుల కృష్ణప్రియ (తెలంగాణ; 1ని:31.26 సెకన్లు)... గ్రూప్–2 బాలుర 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సూర్యాన్షు (తెలంగాణ; 1ని:14.04 సెకన్లు) కాంస్యా లు గెల్చుకున్నారు. గ్రూప్–2 బాలికల 4్ఠ100 మీటర్ల మెడ్లే రిలేలో ఇష్వి మథాయ్, హంసిని, కాల్వ సంజన, మెహరూష్ (తెలంగాణ; 5ని:23.22 సెకన్లు) బృందం కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment