సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ అక్వాటిక్స్ చాంపియన్ షిప్‌లో రెండో రోజూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ), తెలంగాణ స్విమ్మర్లు తమ పతకాల వేట కొనసాగించారు. శుక్రవారం జరిగిన పోటీల్లో వారు తొమ్మిదేసి పతకాలను గెల్చుకున్నారు. తెలంగాణ తరఫున గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో వై.జశ్వంత్ రెడ్డి (తెలంగాణ; 2ని:21.14 సెకన్లు) పసిడి పతకం సాధించాడు. గ్రూప్–2 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో సూర్యాన్షు (తెలంగాణ; 28.37 సెకన్లు), గ్రూప్–1 బాలికల 200 మీటర్ల
బ్రెస్ట్ స్ట్రోక్‌లో ముప్పనేని శ్రీజ
(తెలంగాణ; 3ని:12.72 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో యష్ వర్మ (తెలంగాణ; 2ని:13.67 సెకన్లు) రజత పతకాలను దక్కించుకున్నారు. గ్రూప్–1 బాలుర 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో చల్లగాని అభిలాష్ (తెలంగాణ; 9ని:30.39 సెకన్లు), గ్రూప్–1 బాలికల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో చెన్నవోజుల కృష్ణప్రియ (తెలంగాణ; 35.15 సెకన్లు), గ్రూప్–2 బాలికల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో కాల్వ సంజన (తెలంగాణ; 32.97 సెకన్లు) కాంస్యాలు కైవసం చేసుకున్నారు. గ్రూప్–3 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–2 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో తెలంగాణ బృందాలకు కాంస్యాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున గ్రూప్–1 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో ఎం.వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 27.11 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్; 2ని:25.76 సెకన్లు), గ్రూప్–4 బాలుర 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ఎం. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్; 31.81 సెకన్లు) స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకున్నారు. గ్రూప్–1 బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ఎం. వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 2ని: 03.94 సెకన్లు) రజతం గెలిచాడు. గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మొహమ్మద్ పర్వేజ్ మహరూఫ్ (ఆంధ్రప్రదేశ్; 2ని:48.57 సెకన్లు) కాంస్యం నెగ్గాడు. గ్రూప్–1 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో, గ్రూప్–3 బాలుర 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో ఆంధ్రప్రదేశ్ బృందాలకు కాంస్యాలు లభించాయి.
ఏపీ, తెలంగాణ స్విమ్మర్లకు పతకాల పంట
Published Sat, Dec 29 2018 12:56 AM | Last Updated on Sat, Dec 29 2018 12:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment